బిజినెస్

పీఎఫ్‌సీకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ)కి కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒడిసాలో ఈ సంస్థకు ఇచ్చిన 4000 మెగావాట్స్ సామర్థ్యంగల బొగ్గు గని లీజ్‌ను నిలిపివేసింది. అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కోల్ మైన్స్ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిసాలోని బాంకుహుయ్ బొగ్గు గనిని లీజ్ కు ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ, ఇంత వరకూ ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించలేదని ఆ ప్రకటనలో వ్యాఖ్యానించింది. పరిస్థితిని గమనించిన తర్వాత, సామర్థ్యంగల సంస్థ లేదా కంపెనీకి ఈ గని లీజ్‌ను అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 4000 మెగా వాట్స్ విద్యుత్ సామర్థ్యంగల ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును ఉత్పత్తి చేయాల్సిన పీఎఫ్‌సీ ఆ దిశగా ముందుకు సాగలేకపోయిందని గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింతకాలం వేచి చూడడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది.