బిజినెస్

‘టాప్-10’లో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: గత వారం భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసిన కారణంగా, ‘టాప్-10’ జాబితాలో ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ పతనమైంది. ఐసీఐసీఐ అత్యధికంగా నష్టపోగా, ఈ ఎనిమిది కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా 26,624.10 కోట్ల రూపాయల మేరకు తగ్గింది. నష్టాలను చవిచూసిన కంపెనీల్లో ఐసీఐసీఐ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్‌బీఐ ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని, లాభాలను ఆర్జించిన కంపెనీల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐటీసీ ఉన్నాయి. గత వారం ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ ఏకంగా 6,883.44 కోట్ల రూపాయలు తగ్గి, 3,48,532.24 కోట్ల రూపాయలుగా నమోదైంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ విలువ 5,197.08 కోట్ల రూపాయలు పతనం కావడంతో, 3,16,763.68 కోట్ల రూపాయలకు చేరింది. అదే విధంగా హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) 4,589.40 కోట్ల రూపాయల మేరకు నష్టపోయి, 4,17,538.13 కోట్ల రూపాయలకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ 3,724.38 రూపాయలు తగ్గడంతో, 6,94,541.80 కోట్ల రూపాయలకు దిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ విలువ 3,123.61 కోట్ల రూపాయలు తగ్గడంతో 2,97,858.91 కోట్ల రూపాయలకు పడిపోయింది. రిల్ విలువ 3,106.21 కోట్ల రూపాయలు తగ్గి, 9,74,494.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ కంపెనీలన్నీ నష్టాలను చవిచూడగా, అందుకు భిన్నంగా ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ 3,960.45 కోట్ల రూపాయలు పెరగడంతో, 3,17,730.27 కోట్ల రూపాయలకు చేరింది. ఐటీసీ విలువ కూడా 1,843.66 కోట్ల రూపాయలు పెరగడంతో 2,93,081.89 కోట్ల రూపాయలకు ఎదిగింది. హెచ్‌డీఎఫ్‌సీ 1,772.25 కోట్ల రూపాయలు మెరుగుపడడంతో 4,24,432.18 కోట్ల రూపాయలకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎల్) విలువ 844.29 కోట్ల రూపాయలు అధికమై, 8,25,674.73 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ర్యాంకింగ్స్ విషయానికి వస్తే, రిల్ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతున్నది. ఆతర్వాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ ఆక్రమించాయి. గత వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 110.53 పాయింట్లు పతనమై 41,464.61 పాయింట్లకు చేరిన విషయం తెలిసిందే. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 55.55 పాయింట్ల తగ్గడంతో, 12,226.65 పాయింట్ల వద్ద ముగిసింది.