బిజినెస్

రూ.100 కోట్లతో పసుపు సాగు ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 5: విశాఖ ఏజెన్సీ ప్రాం తంలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో మేలురకమైన పసుపు పంట సాగు ప్రాజెక్టు చేపట్టనున్నారు. పసుపు సా గు ప్రాజెక్టుకు ఈ మేరకు నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఐటీడీఏఎ పీవో బాలాజీ తెలిపారు. ఆదివారం ఐటీడీఏ పరిధిలోని సీలేరు పీహెచ్‌సీని తనిఖీ చేసేందుకు వచ్చిన పీవో బాలాజీ మాట్లాడుతూ పసుపు సాగుకు ఏజెన్సీ అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల కాల పరిమితితో పసుపు ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నెల్ ఇస్తూ నిధులు మంజూరు చేసిందన్నారు. ఈప్రాజెక్టు కోసం జెర్మటిక్స్ బాయిలర్స్, పాలిష్ యంత్రాలను డ్రీమ్ ఇరిగేషన్ తదితర యంత్రాలను సమకూర్చాల్సి ఉందన్నారు. టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మేలు రకమైన పసుపు విత్తనాలు ఎంపిక చేస్తామన్నారు. ఈప్రాజెక్టు వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు పీవో తెలిపారు.