బిజినెస్

ఎనిమిది రాష్ట్రాల వద్ద స్పష్టమైన ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ జనవరి 5: వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయ ని కేంద్రం ప్రకటించింది. మిగతా రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ధిష్టమైన ప్రణాళికను సమర్పించలేదని తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, తమిళనా డు, అస్సాం, పంజాబ్, కర్నాటక రాష్ట్రాలు అగ్రీ ఎక్స్‌పోర్ట్ పాలసీపై చర్చించి, విధివిధానాలతో కూడిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయని వివరించింది. భిన్న ప్రాంతాల్లో, విభిన్న వాతావరణం, భూ రకాలు ఉన్న నేపథ్యంలో, అగ్రీ ఎక్స్‌పోర్ట్ పాలసీపై దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని తెలిపింది. అందుకే, ఆయా రాష్ట్రాలను సమగ్ర ప్రణాళికలను సమర్పించాల్సిందిగా కోరామని, ఇప్పటి వరకూ ఎనిమిది రాష్ట్రాల నుంచే ఇది అందాయని కేం ద్రం ఒక ప్రకటనలో తెలిపింది.