బిజినెస్

ఆర్థిక సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు అన్ని దేశాలు సమష్టిగా కృషి చేయాలని ప్రముఖ ఆర్థిక శాస్తవ్రేత్త, నోబెల్ పురస్కార గ్రహీత ఎరిక్ స్టార్క్ మస్కిన్ పిలుపునిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలన్నీ ఏకీభావంతో ముందుగా సాగడం అనుకున్నంత సులభం కాదని ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా అన్ని దేశాలూ స్వార్థ చింతనతో ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మస్కిన్ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారానికి కృ షి చేయకుండా, మిగతా అన్ని దేశాలూ కృషి చేయాలంటూ ప్రతి దేశం ఆలోచిస్తుందని, అందుకే ఎదరూ ముందుకు రావడం లేద ని ఆయన అన్నారు. విశ్వవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆర్థికాది సమస్యల పరిష్కారానికి ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయకపోతే, భవిష్యత్తు మరింత గందరగోళంగా మారుతుందని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచేందుకు సరైన ప్రణాళికలు, అమలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా కృషి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'చిత్రం... నోబెల్ పురస్కార గ్రహీత మస్కిన్