బిజినెస్

సజావుగా బ్యాంకు సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఈనెల 8న సార్వత్రక సమ్మెకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా సేవలు అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సిండికేట్ బ్యాంక్ ప్రకటించింది. అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం, భారత బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య, భారత జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య, భారత జాతీయ బ్యాంక్ అధికారుల కాంగ్రెస్ నుంచి సమ్మె నోటీసు అందినట్టు ఆ ప్రకటనలో సిండికేట్ బ్యాంక్ తెలిపింది. ఈ ఒక రోజు సమ్మె కారణంగా ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తరాదన్నదే తమ అభిమతమని, అందుకే, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకున్నామని వివరించింది. ఇలావుంటే, వివిధ బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు ప్రకటించిన విధంగా ఒక రోజు సమ్మె జరిగితే, ఖాతాదారులకు సమస్యలు తప్పవని అంటున్నారు. సాధారణ సిబ్బందితోపాటు, అధికారులు కూడా సమ్మెకు దిగితే, పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుందన్నది వాస్తవం.