బిజినెస్

స్క్రాప్ రహిత వర్క్‌షాపుగా రేణిగుంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: ప్రయాణికులను ఆకర్శించడానికి నూతన సాంకేతిక సహకారంతో రైలు బోగీలను ఆధునీకరించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ అధికారులకు సూచించారు. శనివారం రేణిగుంట వద్ద ఉన్న రైల్వే బోగీల మర్మతుల వర్క్‌షాపు(క్యారేజ్ రిపేర్ షాప్)లో ఆయన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్యారేజ్ రిపేర్ షాపులో అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొట్టమొదటిసారిగా స్క్రాప్ రహిత వర్క్‌షాపుగా జీఎం ప్రకటించారు. రైలు బోగీల మరమ్మతుల్లో నూతన సాంకేతిక సహకారాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోగీలను తీర్చదిద్దాలన్నారు. ప్రయాణికులు రైల్వే ప్రయాణాన్ని కోరుకునే విధంగా ఆధునిక సాంకేతికను వినియోగించుకోవాలన్నారు. బోగీల మరమ్మతుల్లో భద్రత పరిరక్షణ, నాణ్యత, పరిశుభ్రత అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ఏదైనా ప్రమాదాను ముందస్తుగా ప్రయాణికులకు తెలియజేయడానికి నూతన సాంకేతిక సహకారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. అన్ని విభాగాల్లో నాణ్యతకు ప్రధాన్యత ఇచ్చిన వర్క్‌షాప్ సిబ్బందికి రూ. 2 లక్షల గ్రూప్ అవార్డులను జీఎం గజానన్ ప్రకటించారు. తనిఖీల్లో రైల్వే చీఫ్ మెకానికల్ ఇంజనీర్ జెకె జైన్, తిరుపతి సీఆర్‌ఎస్ క్యారేజ్ వర్క్‌షాప్ మేనేజర్ శ్రీనివాస్, గుంతకల్ డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
'చిత్రం... తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద ఉన్న రైల్వే బోగీల మరమ్మతుల వర్క్‌షాప్‌ను తనిఖీ చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్