బిజినెస్

మార్కెట్లకు తప్పని నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: పాత, కొత్త సంవత్సరాలకు వారధిగా నిలిచిన ఈవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కొత్త సంవత్సరంలో రాజకీ య, ఆర్థిక రంగాల్లో రాబోయే మార్పులు ఏ విధం గా ఉంటాయో అర్థంకాని పరిస్థితుల్లో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా ఈవారం ట్రేడింగ్ జరిగిన ఐదు రోజుల్లో, రెండు రోజులు లా భాలు నమోదుకాగా, మూడు రోజులు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ మొదట్లో లాభాల్లోనే నడిచినప్పటికీ, ఆతర్వాత అమ్మకాల ఒత్తిడికి పెరిగిన కారణంగా 17.14 పాయింట్లు (0.04 శాతం) నష్టపోయి, 41,558 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 14.80 పాయింట్లు (4.26 శాతం) పతనమై, 12,260 పాయింట్లుగా న మోదైంది. ఏడాది చివరి రోజైన మంగళవారం కూ డా పరిస్థితి మరింత దారుణంగా మారింది. సెనె్సక్స్ ఏకంగా 300.35 పాయింట్లు (0.72 శాతం) తగ్గడంతో 41,257.65 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ 87.40 పాయింట్లు (0.71 శాతం) పడిపోయి, 12,168.45 పాయింట్లకు చేరింది. ఆంగ్ల సంవత్సరాదిన పరిస్థితి కొంత కుదుటపడింది. కొత్త సంవత్సరంలో పరిణామాలపై అయోమయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, సెనె్సక్స్ 52.28 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 41,306.02 పాయింట్లకు చేరింది. అదే విధంగా నిఫ్టీ 21.25 పాయింట్లు (0.17 శాతం) మెరుగుపడి 12,189.25 పాయింట్లుగా నమోదైంది. గురువారం కూడా మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి. సెనె్సక్స్ 320.62 పాయింట్లు (0.78 శాతం) లాభపడడంతో 41,626.64 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 99.70 పాయింట్లు (0.82 శాతం) లాభపడి, 12,282.20 పాయింట్లకు ఎదిగింది. అయితే, ఈవారం ట్రేడింగ్‌కు చివరి రోజైన శుక్రవారం మరోసారి నష్టాలు తప్పలేదు. సెనె్సక్స్ 162.03 శాతం (0.39 శాతం) నష్టపోయి 41,464.61 పాయింట్లకు చేరింది. అదే విధంగా సెనె్సక్స్ 55.55 పాయింట్లు (0.45 శాతం) పతనమై, 12,226.65 పాయింట్ల వద్ద ముగిసింది. స్థూలంగా చూస్తే, ఈవారం మొత్తం మీద ట్రేడింగ్ పూర్తిగా అనిశ్చితి మధ్య కొనసాగింది. కొత్త సంవత్సరం ప్ర భావం కంటే, జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనన్న అనుమానం మదుపరులను వేధించింది. ఫలితంగా ట్రేడింగ్ మందగించింది. ఒక రోజున 300 పాయింట్లకు పైగా భారీ నష్టం, మరోసారి అదే స్థాయిలో లాభం నమోదు కావడం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితికి అద్దం పడుతుంది. వచ్చే వారం కూడా మార్కెట్ నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.