బిజినెస్

సికింద్రాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈనెల 6వ తేదీన తిరుమలలో జరగనున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈనెల 4వ తేదీన సికింద్రాబాద్- తిరుపతికి 07429 రైలును నడుపుతారు. అలాగే, తిరగు ప్రయాణంలో ఈనెల 6వ తేదీన తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు 07430 రైలును ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈనెల 4వతేదీ సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో తిరుపతిలో ఈనెల 6వ తేదీన సాయంత్రం 6.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. గుంటూరు- కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు (17252- 17251) ఇకనుంచి ఎక్స్‌ప్రెస్ రైలుగా కేంద్ర రైల్వే అధికారులు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రైలును గుంటూరు- కాచిగూడ- గుంటూరు రైలుగా పిలుస్తారు. గుంటూరు- కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరులో రాత్రి 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు అదే రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్‌చెర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, డోన్, నంద్యాల, గిద్దలూరు, దొనకొండ, వినుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు చేరుకుంటుంది. ఈ రైల్లో ఏసీ త్రీటైర్ సౌకర్యం ఉంటుందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు జనవరి 3వ తేదీ నుంచి మార్చి వరకూ 124 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ రైళ్లు కాకినాడ- రాయచూరు 07245- 07246 (వయా నంద్యాల) అలాగే, విజయవాడ- కర్నూల్ 07237- 07238 రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లల్లో త్రీటైర్ ఏసీ సౌకర్యం ఉంటుంది. ఈ రైళ్లకు ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవచ్చునని రైల్వే అధికారులు పేర్కొన్నారు.