బిజినెస్

అంతర్జాతీయ సర్వీసుల కోసం సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 2: విజయవాడ విమానాశ్రయం నుండి రాకపోకలు సాగించే విదేశీ ప్రయాణికుల సౌకర్యార్థం ముంబయి మీదుగా దోహా, అబుదాబీ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గన్నవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం మధుసూనరావు తెలిపారు. గురువారం ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి రోజు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ఉదయం, సాయంత్రం పయనించే ఎయిర్ ఇండియా విమానాల ద్వారా ఢిల్లీ వెళ్లి, అక్కడ నుండి విదేశాలకు వెళ్ళే ప్రయాణికులకు విజయవాడ ఎయిర్ పోర్టులోనే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, భద్రతా తనిఖీలు పూర్తి చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఢిల్లీలో ఢిల్లీలో తనిఖీలు చేయించుకునే అవసరం ఉండదన్నారు. వేసవిలో ఢిల్లీ, వారణాసి, షిర్డీలకు నూతన సర్వీసుల ప్రారంభానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ విమానాశ్రయం నుండి 11.91 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని, 2019-20 సంవత్సరంలో ఇప్పటివరకు 11.21 లక్షల మంది పయనించినట్లు వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, 2020 ఏప్రిల్ నుండి కొత్త సర్వీసులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మధుసూదనరావు స్పష్టం చేశారు.