బిజినెస్

14.67 శాతం తగ్గిన టీవీఎస్ వాహన విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: గడచిన డిసెంబర్ మాసంలో తమ కంపెనీ మోటారు వాహనాల విక్రయాలు 14.67 శాతం తగ్గిపోయిందని టీవీఎస్ మో టార్ కంపెనీ గురువారం నాడిక్కడ వెల్లడించింది. 2019 డిసెంబర్‌లో మొత్తం 2,3,571 యూనిట్ల వాహన విక్రయాలు జరిగాయని తెలిపింది. 2018 డిసెంబర్‌లో 2,71,495 యూనిట్ల విక్రయాలు జరిగాయని వివరించింది. అలాగే దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాలు గత నెలలో 25 శాతం తగ్గిపోయి 1,57,244 యూనిట్లకు పరిమితమైందని, గడచిన ఏడాది ఇదే నెలలో 2,09,906 యూనిట్ల విక్రయం జరిగిందని తెలిపింది. మోటార్ సైకిళ్ల విక్రయం 1,07,189 యూనిట్ల నుంచి 93,697కు పడిపోయిందని, స్కూటర్ల విక్రయం సైతం 91,480 నుంచి 74,716 యూనిట్లకు పడిపోయిందని తెలిపింది. ఐతే త్రి చక్ర వాహన విక్రయాలు మాత్రం 26 శాతం పెరిగాయని, 2018 డిసెంబర్‌లో 12,686 వాహనాలు విక్రయించగా 2019 డిసెంబర్‌లో ఆ సంఖ్య 15,952కు పెరిగిందని తెలిపింది. అలాగే ఎగుమతులు గత సంవత్సరం మొత్తంమీద 22 శాతం పెరిగి 60,262 నుంచి 73,512 యూనిట్లకు చేరిందని, ఇందులో ద్విచక్ర వాహనాలు ఎగుమతుల్లో 20 శాతం వృద్ధి చోటుచేసుకుందని వివరించింది.