బిజినెస్

మిశ్రమ ఫలితాలతో ముగిసిన కేబుల్ టీవీ ఆపరేటర్ల షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ వినియోగదారులకు తక్కువ సబ్‌స్క్రిప్షన్ ధరతో అదనపుచానళ్ల సదుపాయాన్ని కల్పించనున్నట్టు నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ప్రకటించింది. ఈక్రమంలో స్టాక్ మార్కెట్లలో బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల వాటాలు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. బీఎస్‌ఈలో సన్‌టీవీ నెట్‌వర్క్ స్టాక్ ధర ఇంట్రాడేలో 6.37 శాతానికి తగ్గిపోయి మళ్లీ పుంజుకుని 1.25 శాతం నష్టంతో ముగిసింది. ఇక డెన్ నెట్‌వర్క్ వాటాలు 0.11 శాతం నష్టపోయాయి. ఐతే డిష్‌టీవీ ఇండియా వాటాలు 2.26 శాతం లాభపడగా, జీ ఎంటర్‌టైనె్మంట్ ఎంటర్‌ప్రైజెస్ వాటాలు సైతం 0.45 శాతం బలపడ్డాయి. ఈ కంపెనీల వాటాలు ఉదయం నుంచి ఆరంభమైన ట్రేడింగ్‌లో నష్టాల పాలవగా తర్వాత కోలుకున్నాయి. ఇలావుండగా వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్రాడ్‌కాస్ట్ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త రెగ్యులేటరీ మార్గదర్శకాలను సవరించింది. ఈమేరకు అన్ని ఉచిత చానళ్లకు నెలవారీగా చెల్లించాల్సిన సొమ్మును రూ. 160గా నిర్ణయించింది. వచ్చే మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.