బిజినెస్

గీతం వర్సిటీకి భారీ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: హైదరాబాద్ గీతం డీమ్డ్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సురేంద్రబాబు మనుబోలు సూర్యకు ముంబైలోని అణుశక్తి విభాగానికి చెందిన అణుశక్తి పరిశోధనా బోర్డు భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ విషయాన్ని గీతం వర్శిటీ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ బుధవారం నాడు తెలిపారు. ఎంవోఎఫ్‌లను ఉపయోగించి సజల అణు వ్యర్థాల నుండి స్ట్రోంటియం అయాన్ల ఎంపిక, వెలికితీత పేరిట చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు బీఆర్‌ఎన్‌ఎస్ సిఫార్సు పరిపాలనా అనుమతులు అందజేసింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభం అయ్యే ఈ ప్రాజెక్టుకు 32.50 లక్షల గ్రాంట్‌ను మంజూరు చేసిందని అన్నారు. ఈ పరిశోధనలో సాయపడేందుకు గానూ ప్రాజెక్టు ఫెలో అవసరం ఉందని, ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, నెట్ జేఆర్‌ఎఫ్, గేట్‌లలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. సురేంద్రబాబును రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఎస్ సీతారామయ్య, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ జీ రాంబాబు, యూజీసీ వ్యవహారాల సమన్వయ కర్త ఐవీ సుబ్బారెడ్డి తదితరులు అభినందించారు.