బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘హ్యాపీ’ న్యూ ఇయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 1: నూతన సంవత్సరం 2020 తొలి వాణిజ్య దినం దేశీయ స్టాక్ మార్కెట్లకు శుభారంభాన్నిచ్చింది. ఇన్పోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, లార్సన్ అండ్ టర్బో భారీ లాభాలను సంతరించుకోవడంతో నష్టాల బాటను అధిగమించిన స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. 2019 చివరి రోజైన మంగళవారం అధిక స్థాయిలో నష్టాలపాలైన స్టాక్ మార్కెట్లు మదుపర్లను నిరాశపరచిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేని పరిస్థితుల్లో దేశ ఆర్థికాభివృద్ధి సానుకూల అంచనాలు మార్కెట్లకు చేయూతనిచ్చాయి. 2019 సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీలో కరెంట్ అకౌంట్ వార్షిక లోటు (సీఏడీ) సమాన స్థాయి 0.9 శాతానికి (6.3 బిలియన్ డాలర్లకు) చేరింది. ఇందుకు కారణం వాణిజ్య మాంద్యం తగ్గడమేనని విశే్లషకులు చెబుతున్నారు. ఈ పరిణామం మదుపర్ల సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపిందని వారు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 52.28 పాయింట్లు (0.13 శాతం) లాభపడి 41,306.02 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 14.05 పాయింట్లు (0.12 శాతం) లాభపడి 12,182.50 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో పవర్‌గ్రిడ్ అత్యధికంగా 2.76 శాతం లాభపడింది. అదే బాటలో ఎన్‌టీపీసీ, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, హిందుస్తాన్ యూనీలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్ఫోసిస్ సైతం లాభాలను సంతరించుకున్నాయి.
మరోవైపు టైటాన్ అత్యధికంగా 2.76 శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.72 శాతం, బజాజ్ ఆటో 1.21 శాతం నష్టపోయాయి. ఆరంభం నుంచి ప్రధాన సూచీలు నష్టాలను నమోదు చేశాయి. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో సూచీలు లాభాల బాటపట్టాయి. చివరికి స్వల్ప లాభాలతో నూతన సంవత్సరానికి శుభసూచకంగా ముగిశాయి. ఇక రంగాలవారీగా చూస్తే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, పార్మా రంగాలు లాభాలను సంతరించుకున్నాయి. వాహన, లోహ, ఫైనాన్షియల్ సూచీలు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు బుధవారం సంవత్సరారంభ సందర్భంగా సెలవు.