బిజినెస్

బొగ్గుతో పాటు వ్యవసాయ వ్యర్థ గుళికల వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: వ్యవసాయ వ్యర్థాలతో కూడిన గుళికలను సైతం ఇకపై బొగ్గుతోబాటు విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించాలని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) నిర్ణయించింది. ఈమేరకు ఆరు మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థ గుళికలను సేకరించాలని తీర్మానించింది. ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేసే సమయంలో బొగ్గుతోబాటు మండేందుకు ‘కోఫైర్’ ఇంధనంగా ఈ వ్యవసాయ వ్యర్థ గుళికలను వినియోగిస్తారు. తద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు బొగ్గు కొరత కారణంగా ఏర్పడే ఆటంకాలు తమసిపోయి ఉత్పత్తిలో స్థిరత్వం చోటుచేసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ వ్యవసాయ వ్యర్థ ఆధారిత గుళికలను ప్రయోగాత్మకంగా ‘దాద్రి’ థర్మల్ పవర్ ప్లాంట్‌లో వినియోగిస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో 2020లో ఆ కంపెనీకి దేశ వ్యాప్తంగా ఉన్న 21 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఈ గుళికలను వినియోగించాలని నిర్ణయించారు. కంపెనీకి మొత్తం 24 బొగ్గు మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ధర్మల్ కేంద్రాలున్నాయి. అలాగే అనుబంధ సంస్థలకు చెందిన మరో 9 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటన్నింటికీ వ్యవసాయాధారిత వ్యర్థ గుళికల సేకరణ నిమిత్తం టెండర్ల ప్రక్రియ ఆరంభమైందని సంబంధిత అధికారి తెలిపారు. మొత్తం ఆరు మిలియన్ టన్నుల గుళికలను సేకరించాలన్న లక్ష్యం ఉందని, ఒక్కో టన్ను గుళికల ధర సుమారుగా రూ. 7వేల వరకు ఉంటుందని ఆయన వివరించారు. మొత్తం సేకరణకు రూ. 4,200 కోట్లు వ్యయం కావచ్చన్నారు. ప్రస్తుతం ప్లాంట్లలో వినియోగిస్తున్న బొగ్గుకు కుంచెల వినియోగం, పొడివంటి సమస్యలున్నాయని, తాజాగా బొగ్గుకు తోడుగా వ్యవసాయ వ్యర్థ ఆధారిత గుళికలు వినియోగించడం ద్వారా ఆ సమస్యలు తొలగుతాయని తెలిపారు. గత పక్షం రోజుల వ్యవధిలో దాద్రి పవర్ ప్లాంట్‌లో బొగ్గుతోబాటు 70 నుంచి 80 టన్నుల ఆగ్రోబేస్డ్ పెల్లట్‌లను వినియోగించడం జరిగింది. హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరఫరాదారుల ద్వారా ఈ గుళికలను సేకరించారు.