బిజినెస్

వౌలిక వసతుల రంగంలో 388 ప్రాజెక్టులపై అదనపు వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా వౌలిక వసతుల రంగానికి చెందిన 388 ప్రాజెక్టులు అదనపు వ్యయ భారంతో అలమటిస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు విలువ సుమారు రూ. 150 కోట్లుకాగా వీటి నిర్మాణంలో వివిధ కారణాలతో జాప్యం నెలకొని సుమారు రూ. 4లక్షల కోట్ల మేర అదనపు వ్యయభారం పడింది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ రూ. 150 కోట్లు, అంతకుమించిన వ్యయ అంచనాలతో కూడిన వౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇలా ఈ శాఖ పరిధిలోని మొత్తం 1,636 ప్రాజెక్టుల్లో 388 ప్రాజెక్టుల నిర్మాణం అధిక వ్యయ భారం కారణంగా ఆలస్యం అవుతుండగా 563 ప్రాజెక్టులు మాత్రమే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తికావస్తున్నాయి. ఈ మం త్రిత్వ శాఖ నిర్వహణలోని 1,636 ప్రాజెక్టుల వాస్తవ ఖర్చు అంచనాలు రూ. 19,52,524.85 కోట్లు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 23,53,108.80 కోట్లు వ్యయం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే వాస్తవ వ్యయంకంటే 20.52 శాతం అదనపు భారం ఈ ప్రాజెక్టులపై పడింది. దీన్నిబట్టి రూ. 4,00,583.95 కోట్లు అదనంగా ఈ ప్రాజెక్టులకోసం ప్రభుత్వం వ్యయం చేయాల్సిన అగత్వం నెలకొంది. ఐతే గడచిన 2019 అక్టోబర్ నాటికి 43.86 శాతంగా ఉన్న ఈ అదనపు భారాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్యలు విజయవంతం కావడం వల్లే తాజాగా ఆ భారం 20.52 శాతానికి దిగివచ్చిందని, ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య 490కి తగ్గిందని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. 563 ప్రాజెక్టుల్లో 185 ప్రాజెక్టులు 1 నుంచి 12 నెలలు, 123 ప్రాజెక్టులు 13 నుంచి 24 నెలలు, 136 ప్రాజెక్టులు 25 నుంచి 60 నెలలు 119 ప్రాజెక్టులు 61 నెలలకు పైబడి ఆలస్యం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కనీస కాలయాపన 38.74 నెలలుగా ఉంది.