బిజినెస్

నేటి నుంచే స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం తొలి రోజునే అమలులోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం రైల్వే చార్జీలను పెం చింది. సబర్బన్ రైళ్లకు ఈ పెంపుదల నుంచి మినహాయింపునిస్తూ ఆర్డిన రీ, నాన్ ఏసీ, నాన్ సబర్బన్ చార్జీల ను కిలోమీటర్‌కు పైసా చొప్పున పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసిం ది. అలాగే, మెయిల్/ఎక్స్‌ప్రెస్, నాన్ ఏసీ రైళ్ల చార్జీలను కిలోమీటర్‌కు రెం డు పైసలు చొప్పున, ఏసీ చార్జీలను కిలోమీటర్‌కు నాలుగు పైసలు చొ ప్పున పెంచింది. ఈ చార్జీలు ప్రీమి యం రైళ్లుగా భావించే శతాబ్ది, రాజధాని, దురంతోలకు వర్తిస్తాయి. తా జా పెంపుదల ప్రకారం ఢిల్లీ, కోల్‌కతాల మధ్య నడిచే రాజధాని (1447) రైలు చార్జీ కిలోమీటరుకు నాలుగు పైసలు చొప్పున పెరిగితే మొత్తం పెరుగుదల రూ.58 అవుతుంది. రిజర్వేషన్, సూపర్‌ఫాస్ట్ చా ర్జీల్లో ఎ లాంటి మార్పు లేదు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకొన్న టిక్కెట్లకు తాజా పెంపుదల భారం వర్తించదు. చివరిసారిగా 2014-15లో రైలు ప్రయా ణ, సరుకు రవాణా చార్జీలు 14.2 శా తం, 6.5 శాతం చొప్పున పెరిగాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన రైలు చార్జీలను కేం ద్రం పెంచుతూ వచ్చింది. అలాగే, వందేభారత్, తే జాస్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను ప్రవేశపెట్టింది. మి గతా రైలు చార్జీల కంటే ఈ రెండు రైళ్ల ప్రయాణ చార్జీలు ఎక్కువే. పెం చిన చార్జీలతో నెట్‌వర్క్ ఆధునీకరణకు వినియోగిస్తామని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.