బిజినెస్

కొత్త ఏడాదిలో దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది 2020లో సరికొత్త గరిష్ట స్థాయి లాభాలను ఆర్జిస్థాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సూచీలు కనీసం 12 నుంచి 15 శాతం అదనంగా లాభపడే అవకాశాలున్నాయంటున్నారు. ఇందుకు వచ్చే ఏడాది జరిగే ఆర్థికాభివృద్ధి ప్రధాన కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ఏడాదిలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయాలు, అమెరికా ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల్లో కోత విధించినప్పటి నుంచి మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం పడిందని, ఐతే దేశ ఆర్థిక దుస్థితిని సరిదిద్దే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి తీసుకున్న చర్యలు దిగువ స్థాయి నుంచి సత్ఫలితాలనిచ్చేందుకు మరికొంత కాలం పట్టవచ్చని అంటున్నారు. కాగా భారత ఆర్థిక రంగానికి దీర్ఘకాలికంగా మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశాలున్నాయని ప్రముఖ విశే్లషకుడు సిద్దార్థ్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. ఇలావుండగా 2019లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా లాభపడ్డాయి. డిసెంబర్ 20న బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 41,809.96 పాయింట్ల రికార్డు గరిష్టాన్ని తాకింది. మొత్తం సంవత్సరంలో ఈ సూచీ 5,000 పాయింట్లు (15 శాతం) లాభపడింది. ప్రత్యేకించి కార్పొరేట్ పన్నుల కోత, పరిశ్రమల్లోకి గణనీయంగా వచ్చిన పెట్టుబడులు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదమవుతాయన్న అంచనాలు వంటి పలు అంశాలు ఇందుకు దోహదం చేశాయి. కొత్త సంవత్సరం నుంచి క్రమంగా పుంజుకునే వృద్ధిరేటు 2021లో మంచి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని, స్టాక్ మార్కెట్లు సైతం మంచి లాభాల ర్యాలీ తీస్తాయని, ప్రస్తుత మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకుంటే స్వల్పకాలికంగానే మార్కెట్లు గణనీయంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయని మరో ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా ఉంటాయని ముందస్తు చర్యల తీరునుబట్టి తేటతెల్లం అవుతోందని విశే్లషకులు అమిత్‌గుప్తా, అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత నాలుగు నెలల కాల బుల్లిష్ ట్రెండ్ 2020లో సైతం కొనసాగే పరిస్థితులున్నాయన్నారు. 2020లో నిఫ్టీ సైతం 14,000 మార్కును తాకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని, సెనె్సక్స్ 47,000 మార్కును దాటవచ్చని విశే్లషకుడు ఉమేష్ మెహతా తెలిపారు. త్వరలోనే నిఫ్టీ 13,500 మార్కును, సెనె్సక్స్ 46,000 మార్కును దాటడం మనం చూస్తామన్నారు. ఇక అంతర్జాతీయంగా ఐరోపా దేశాల మార్కెట్ల భవితను బ్రెగ్జిట్ నిర్ణయించనుందని, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఎలా ముగుస్తాయన్నదాన్నిబట్టి మిగిలిన దేశాల మార్కెట్ల తీరు ఉంటుందని విశే్లషకుడు ఖెమ్కా తెలిపారు.