బిజినెస్

ఏడాది చివరి రోజు నష్టాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు 2019 చివరి రోజైన మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ 304.26 పాయింట్లు, నిఫ్టీ 87.40 పాయింట్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచే మంచి లాభాలతో ఆరంభమైన సెనె్సక్స్ పరుగు ఇంట్రాడేలో 423 పాయింట్లు అదనంగా లాభపడింది. ఐతే వివిధ ప్రధాన కార్పొరేట్ కంపెనీలు తీవ్ర నష్టాలపాలవడంతో ఒక్కసారిగా సూచీల తిరోగమనం జరిగి చివరికి సెనె్సక్స్ 304.26 పాయింట్లు (0.73 శాతం) కోల్పోయి 41,253.74 పాయింట్ల దిగువన స్థిరపడింది. అలాగే నిఫ్టీ 87.40 పాయింట్లు (0.71 శాతం) నష్టపోయి 12,168.45 పాయింట్ల దిగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 2.51 శాతం నష్టపోయింది. అదే బాటలో బజాజ్ ఆటో, ఆర్‌ఐఎల్, హీరోమోటోకార్ప్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ సైతం నష్టాలపాలయ్యాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, సన్‌పార్మా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో ఇందన, టెలికాం, వాహన, టెక్, ఐటీ, ఫైనాన్స్ సూచీలు 1.20 శాతం నష్టపోయాయి. అలాగే విద్యుత్, స్థిరాస్తి, లోహ సూచీలు 0.83 శాతం లాభపడ్డాయి. మదుపర్లు వేచిచూసే దోరణిని అవలంభించడం వల్లే ఇలా మార్కెట్లు నష్టాలపాలయ్యాయని విశే్లషకులు చెబుతున్నారు. పైగా వార్షిక ఆర్థిక లోటు లక్ష్యానికి ప్రభుత్వం గండికొడుతుందన్న కథనాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయంటున్నారు.
మిశ్రమ ఫలితాల్లో అంతర్జాతీయ మార్కెట్లు
ఏడాది చివరి రోజు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. టోక్యో, సియోల్ మార్కెట్లకు సెలవుదినంకాగా, షాంఘై 0.33 శాతం లాభపడింది. మరోవైపు హాంగ్‌కాంగ్ మార్కెట్లు 0.46 శాతం నష్టపోయాయి. అలాగే ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం 5 పైసలు క్షీణించి ఇంట్రాడేలో 71.36గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.16 శాతం తగ్గి బ్యారెల్ 66.78 డాలర్ల వంతున ట్రేడైంది.