బిజినెస్

సహకార రుణాలపై పరిమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పంజాబ్, మహారాష్ట్ర సహకార బ్యాంకు తరహా భారీ కుంభకోణాలకు భవిష్యత్తులో తావులేకుండా ఉండేందుకు ఆర్‌బీఐ కఠిన చర్యలను తెరపైకి తేబోతోంది. పట్టణ సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలను గరిష్ఠస్థాయిలో కుదించే చర్యలను సోమవారంనాడు చేపట్టింది. ఒకే సంస్థ లేదా ఒకే గ్రూప్‌కు 10 శాతం, 20 శాతం మించి రుణాలను ఇవ్వడానికి వీల్లేదని నిబంధన విధించింది. దీనివల్ల ఒకే సంస్థ లేదా గ్రూపునకు వందల కోట్ల రూపాయల రుణాలను ఇచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండకుండా గట్టి చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఒకే సంస్థకు 15 శాతం, సంస్థల గ్రూపునకు 40 శాతం రుణాలను తమ మూలధనం నిధుల నుంచి ఇచ్చేందుకు పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీ) అవకాశం ఉంది. దానిని ఇప్పుడు 10 శాతం, 20 శాతంగా ఆర్‌బీఐ కుదించింది. హౌసింగ్ డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్) గ్రూపు కంపెనీలకు ఏకంగా 6,226.01 కోట్ల రూపాయల భారీ రుణాన్ని ఇవ్వడం వల్ల పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) కుప్పకూలిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా ఈ బ్యాంకులో డిపాజిట్లు పెట్టిన వేలాదిమంది ఖాతాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేశంలో పట్టణ సహకార బ్యాంకుల పనితీరును ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమీక్షించింది. అలాగే, ఇవి నిధులను అందించే విధివిధానాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఒకే కంపెనీ లేదా కంపెనీల గ్రూపులకు భారీ మొత్తాన్ని రుణాలుగా ఇవ్వడం వల్ల రిస్క్ శాతం తీవ్రంగా పెరిగిపోతుందని ఓ సర్క్యులర్‌లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇంత భారీగా రుణాలు తీసుకున్న కంపెనీ లేదా కంపెనీల గ్రూపు సకాలంలో చెల్లింపులు చేయకపోతే సదరు బ్యాంకుల మూలధనం అలాగే నికర విలువ గణనీయంగా పడిపోతుందని తెలిపింది. ఈ పరిస్థితులు మరింతగా తీవ్రమైతే లిక్విడిటీ సమస్యతోపాటు అంతిమంగా దివాలాకు దారితీసే పరిస్థితులూ తలెత్తుతాయని హెచ్చరించింది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పట్టణ సహకార బ్యాంకులు ఒక కంపెనీ లేదా కంపెనీల గ్రూపునకు ఇచ్చే రుణాల మొత్తాన్ని హేతుబద్ధీకరించామని ఆ ముసాయిదాలో ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై జనవరి 20లోగా తమ తమ అభిప్రాయాలు తెలియజేయాలని బ్యాంకులను కోరింది. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే సంబంధిత పట్టణ సహకార బ్యాంకులు పరిమితికి మించిన బకాయిల మొత్తాన్ని 2023 మార్చి 31లోగా సవరించిన పరిమితుల పరిధిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే, యూఎస్‌బీలు తమ రుణాల పోర్టుపోలియోలో 50 శాతం మొత్తం 25 లక్షలకు మించకుండా చూసుకోవాలని, ఇంతకుమించి ఒకే కంపెనీ లేదా కంపెనీల గ్రూపునకు రుణాలు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఎప్పుడైతే పీఎంసీ బ్యాంకు కుప్పకూలిందో దాదాపుగా 9 లక్షల 15వేల మంది డిపాజిటర్లు అయోమయంలో పడిపోవడంతోపాటు నగదు లభ్యత కూడా తగ్గిపోవడంతో విత్‌డ్రాలపై ఆర్‌బీఐ పరిమితులు విధించింది. హెచ్‌డీఐఎల్‌కు ఇచ్చిన రుణాలు 6,226 కోట్ల రూపాయలు కాగా, అందులో ఆర్‌బీఐకి తెలియజేసిన మొత్తం 439.58 కోట్ల రూపాయలే. మిగతా 5,786 కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.