బిజినెస్

లాభాల ట్రెండ్ కొనసాగవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గడచిన వాణిజ్య వారం ముగింపు రోజున నమోదైన భారీ లాభాల ట్రెండ్‌ను భారత స్టాక్‌మార్కెట్లు ఈ వారం కూడా కొనసాగించే అవకాశాలున్నాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఓ దశ సానుకూల ఒప్పందానికి దారితీయడం ప్రపంచ మార్కెట్లన్నింటికీ ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. అటు అమెరికా, ఇటు చైనా ఆవేశాలతో పోటీలు విధించుకున్న అదనపు సుంకాలను రద్దు చేసుకోవడానికి సైతం అంగీకరించడం వాణిజ్య యుద్ధాన్ని చల్లార్చే పరిణామంగా మారింది. దీంతోబాటే బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ ఘన విజయంతో బ్రెగ్జిట్‌పై సందిగ్ధత తొలగిపోవడం కూడా సానుకూల పరిణామంగా మారింది. వీటికి దేశీయంగా కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు తోడైన క్రమంలో వచ్చే వారం కూడా దేశీయ మార్కెట్లు లాభాల ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలే కనిపిస్తున్నాయని ప్రముఖ విశే్లషకులు అజిత్ మిశ్రా, సిద్దార్థ కెమ్కా అభిప్రాయపడ్డారు. అలాగే కార్పొరేట్ కంపెనీల ఫలితాలతోబాటు సోమవారం వెలువడనున్న డబ్ల్యూపీఎల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై మదుపర్లు దృష్టి నిలిపారు. అలాగే గత వారం రూపాయి బలపడడం, ముడిచమురు ధరల తీరును బేరీజు వేసుకుని చూసినా స్టాక్ మార్కెట్లకే అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని మరో విశే్లషకుడు ముస్త్ఫా నదీమ్ అభిప్రాయపడ్డారు. గత వారం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 564.56 పాయింట్లు (1.39 శాతం) లాభపడింది. కేవలం శుక్రవారం మాత్రమే ఈ సూచీ 428 పాయింట్లు ఎగబాకిన సంగతి తెలిసిందే.