బిజినెస్

గణనీయంగా రాణించిన బ్యాంకింగ్..లోహ వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ అత్యధికంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పరిస్థితులే ఇందుకు కారణమని విశే్లషకులు భావిస్తున్నారు. ప్రధానంగా వడ్డీరేట్లలో వచ్చే ఏడాది వరకు ఎలాంటి మార్పులూ ఉండబోవన్న సంకేతాలు అమెరికన్ ఫెడరల్ రిజర్వు నుంచి వెలువడడం ముదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపిందని అంటున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే సానుకూలంగా కదలాడి ఓ దశలో ఏకంగా 300 పాయింట్లు ఎగబాకింది. చివరికి 169.14 పాయింట్లు (0.42 శాతం) లాభపడి 40,581.71 పాయింట్ల ఎగువ స్ధాయిలో స్థిరపడింది. గురువారం మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 61.65 పాయింట్లు (0.52 శాతం) లాభపడి 11,971.80 పాయింట్ల ఎగువన స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో టాటా మోటార్స్ అత్యధికంగా 7.17 శాతం లాభపడగా, యెస్ బ్యాంక్ 5.96 శాతం, వేదాంత 3.68 శాతం, ఎస్‌బీఐ 2.91 శాతం, కోటక్ బ్యాంక్ 1.76 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.18 శాతం లాభపడ్డాయి. లార్సన్ అండ్ టర్బో 1.23 శాతం లాభపడి ఈ సూచీలో వరుసగా రెండోరోజు లాభాలు వచ్చేందుకు దోహదం చేసింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, సన్‌పార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు దిగ్గజ కంపెనీల స్టాక్స్ నష్టాలపాలయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడడమేనని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ 2.63 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.51 శాతం, టీసీఎస్ 1.20 శాతం నష్టపోగా, ఓఎన్‌జీసీ 1.68 శాతం భారతీ ఎయిర్‌టెల్ 0.95 శాతం వంతున నష్టపోయాయి. వడ్డీరేట్ల పెంపుపై అమెరికన్ ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోబాటు అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల సంకేతాలు వెలువడడం సైతం అంతర్జాతీయంగా మార్కెట్లకు ఊతాన్నిచ్చిందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు దఫాలు రుణ వడ్డీల్లో కోత విధించిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ తాజాగా వచ్చే ఏడాది వరకు రేట్లు పెంచేది లేదని వెల్లడించింది. ప్రధానంగా కనిష్ట స్థాయి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక స్థితిపై దృష్టి నిలుపుతున్నట్టు ప్రకటించింది. కాగా ఐటీ మినహా అన్ని రంగాలకు చెందిన సూచీలూ తాజాగా లాభాల్లో ముగియడం గమనార్హం. కంపెనీల తాజా ఫలితాలపై సైతం మదుపర్లు దృష్టి నిలిపారు. రంగాల సూచీల్లో బీఎస్‌ఈలో లోహ, పారిశ్రామిక, వాహన, బ్యాంకెక్స్, కేపిటల్ గూడ్స్, విద్యుత్ సూచీలు 2.41 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ఐటీ, టెలికాం, టెక్ సూచీలు 1.53 శాతం నష్టపోయాయి.
బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గురువారం 21 పైసలు బలపడి ఇంట్రాడేలో 70.63గా ట్రేడైంది. అలాగే ముడిచమురు ధరలు 0.74 శాతం వృద్ధితో బ్యారెల్ 64.19 డాలర్ల వంతున ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్లలో హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో లాభాల్లో ముగియగా, షాంఘై మాత్రం నష్టాలను నమోదు చేసింది. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి.