బిజినెస్

పర్పుల్ డాట్ కాంలో 30 మిలియన్ డాలర్లు మదుపుచేసిన గోల్డ్‌మన్‌సచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: అంతర్జాతీయ పెట్టుబడుల బ్యాంకు గోల్డ్‌మన్‌సచ్ తన ఇతర అనుబంధ పెట్టుబడిదారులతో కలిసి 30 మిలియన్ డాలర్ల నిధులను ఆన్‌లైన్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సంస్థ ‘పర్పుల్ డాట్ కాం’లో మదుపుచేసింది. ఆ ఆన్‌లైన్ సంస్థ నిర్వహించిన సిరీస్ సీ ఫండింగ్ రౌండ్ కార్యక్రమంలో భాగంగా ఈ పెట్టుబడుల సమీకరణ జరిగింది. ప్రధానంగా అమెరికాకు చెందిన పెట్టుబడిదారులు ఇందులో భాగస్వాములయ్యారు. అలాగే ఇవీకేప్ వెంచర్స్, బ్లూమ్ వెంచర్స్, జెఎస్‌డబ్ల్యు వెంచర్స్ సైతం భాగస్వాములయ్యాయి. ఈ నిధులను తమ కంపెనీ బ్రాండ్లు, ఉత్పత్తుల సరఫరాను మరింతగా బలోపేతం చేసేందుకు సద్వినియోగం చేస్తామని, ఇందుకోసం అంతర్జాతీయ బ్రాండ్ హౌస్‌ల భాగస్వామ్యాన్ని తీసుకుంటామని పర్పుల్ డాట్ కాం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే కంపెనీ టాటా స్టేక్‌ను మహిళల సౌందర్యాభివృద్ధికి సంబంధించిన కంటెంట్‌తో విస్తరిస్తామని దీటిపై ప్రత్యేకంగా పెట్టుబడులు మదుపు చేస్తామని తెలిపింది. ప్రపంచ స్థాయి సౌందర్య సాధనోత్పత్తులతో అంతర్జాతీయంగా ఓ సరఫరా చైన్‌ను ఏర్పాటు చేసేందుకు సైతం నిధులు వెచ్చిస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు మనీష్ తనీజా ఈ సందర్భంగా తెలిపారు.