బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక స్థితి మెరుగైన వెంటనే ఉద్యోగుల వేతన బకాయలు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన బకారుూల చెల్లింపునకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావ్ దోత్రే గురువారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థ పరిస్థితి మెరుగైన వెంటనే కాంట్రాక్టు కార్మికులకు సైతం రావలసిన బకారుూలు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2010 నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ ప్రస్తుతం రూ. 20 వేల కోట్ల అప్పులున్నాయని వివరించారు. ‘ఐనా బీఎస్‌ఎన్‌ఎల్ పరిస్థితి సభ్యులందరికీ తెలిసిందేనని, ఈప్రభుత్వ రంగ టెలికాం సంస్ధతోబాటు ఎంటీఎన్‌ఎల్ పునరుద్ధరణకు అవసరమైన ప్యాకేజీ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఈక్రమంలో సంస్థ పరిస్థితి గాడిలో పడిన వెంటనే జీతభత్యాల చెల్లింపులకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంద’ని ఆయన సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ సంస్ధ నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారికి పేరివిజన్ వర్తింపజేయడం కుదరదని మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పింఛన్ సవరణపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగుల వేతన సవరణతో విశ్రాంత ఉద్యోగులకిచ్చే పింఛన్ సవరణ ముడిపడి ఉందన్నారు. మూల వేతనాన్ని ననుసరించే పింఛనుపై నిర్ణయం చేసేందుకు వీలుందని ఆయన గుర్తు చేశారు. ఇలావుండగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో 78 వేల మంది, ఎంటీఎన్‌ఎల్‌లో 13,500 మంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకానికి అంగీకారం తెలిపారని సహాయ మంత్రి దోత్రే సభకు వెల్లడించారు. ఈ ప్రక్రియను ప్రభుత్వం వచ్చే జనవరి 31కల్లా పూర్తి చేస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న 1.50 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల్లో సుమారు లక్ష మంది వీఆర్‌ఎస్‌కు అర్హులని వివరించారు.