బిజినెస్

వరంగల్‌లో రూ.900 కోట్లతో యంగ్వాన్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కొరియా దేశానికి చెందిన యంగ్వాన్ టెక్స్‌టైల్స్ సంస్థ ముందుకు వచ్చింది. వరంగల్‌లో దాదాపు రూ. 900 కోట్లు పెట్టుబడితో టెక్స్‌టైల్స్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొరియా టెక్స్‌టైల్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. టెక్స్‌టైల్స్ సంస్థకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. దీంతో ఇక టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ టెక్స్‌టైల్స్ సంస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 12వేల మంది యువతకు ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుంది. బుధవారం హైదరాబాద్‌లో కొరియాకు చెందిన యంగ్వాన్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని బడా సంస్థలు ముందుకు వస్తన్నాయన్నారు. రాష్ట్రంలో మంచి వాతావరణం ఉన్నందునే బహుళ జాతి సంస్థలు భారీ పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. వరంగల్‌లో ఏర్పాటు కానున్న మెగా టెక్స్‌టైల్స్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ యాంకర్ యూనిట్‌గా ఉండబోతోందన్నారు. యంగ్వాన్ టెక్స్‌టైల్స్ సంస్థకు దాదాపు 290 ఎకరాల భూమిని బదలాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్స్ పార్క్ దిక్సూచిగా పేరు వస్తుందన్నారు. యంగ్వాన్ టెక్స్‌టైల్స్ సంస్థ ఏర్పాటుకు ప్రధాన కారణం వరంగల్ జిల్లాలో అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకుని ఎగుమతులే లక్ష్యంగా పెట్టుబడులు పెడుతోందన్నారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత స్థానం టెక్స్‌టైల్స్‌కు ఉందన్నారు. గుజరాత్‌లో జరిగిన టెక్స్‌టైల్స్ సమ్మిట్-2017లో కార్పొరేషన్ చైర్మన్ కిసాక్ సుంగ్‌తో జరిపిన చర్చలే ఇపుడు వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్స్‌కు నాంది పలికిందన్నారు. కొరియాతో యంగ్వాన్‌తో ఒప్పందాలు జరగడం తెలంగాణలో ఒక చారిత్రాత్మక విజయం అని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ ముఖచిత్రం మారిపోతుందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలో మెగా టెక్స్‌టైల్స్ పాలసీ గురించి ఆలోచిస్తోందన్నారు. ఈ పాలసీ వస్తే వరంగల్ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్‌టైల్స్ పార్క్ అవుతుందన్నారు. ప్రస్తుతం యంగ్వాన్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ వరంగల్ జిల్లాలో పెద్దఎత్తున పట్టుబడులు పెట్టడానికి సన్నాహాలు చేస్తోందన్నారు. యంగ్వాన్ టెక్స్‌టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సుంగ్ మాట్లాడుతూ ప్రపంచంలోని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్నదని గుర్తు చేశారు. తమ సంస్థ ఇప్పటికే బంగ్లాదేశ్, వియత్నాం, ఇథియోపియాతో పాటు 13 దేశాల్లో టెక్స్‌టైల్స్‌ను ఉత్పత్తి చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 90 వేల మంది తమ కంపెనీలో పనిచేస్తున్నారన్నారు.
తెలంగాణలో తమ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కృషి 99 శాతం ఉంటే, తమ ప్లానింగ్ ఒక్కశాతం మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలే తమను ఇక్కడికి రప్పించాయన్నారు. ఏడాదిలోగా టెక్స్‌టైల్స్ ఉత్పత్తులను ప్రారంభిస్తామన్నారు. యంగ్వాన్ సంస్థ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ఆ సంస్థ చైర్మన్ కిహాక్ సుంగ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, కొరియాలో భారత రాయబారి సుప్రియా రంగనాథ్, గౌరవ కౌన్సుల్ జనరల్ ఆఫ్ కొరియా ఇన్ హైదరాబాద్ సురేష్ చుక్కపల్లి, టెక్స్‌టైల్స్ శాఖ డైరెక్టర్ శైలజా రాయయ్యర్, టీఎస్ ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.