బిజినెస్

బొగ్గు తవ్వకాల్లో నిబంధనలు గాలికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద బొగ్గుగనుల సంస్థ ‘కోల్ ఇండియా’కు అనుబంధంగా ఉన్న ఏడు సంస్థల్లో ఆరు సంస్థలు కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలను తుంగలో తొక్కాయని కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. ‘బొగ్గు గనుల తవ్వకాల కారణంగా పర్యావరణ ప్రభావంపై అంచనా, తద్వారా కోల్ ఇండియా లిమిటెడ్ దాని అనుబంధ సంస్థలపై పడుతున్న ప్రతికూలతల తగ్గింపు’ పేరిట ఈ నివేదిక వెలువడగా పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం ఈ నివేదికపై చర్చజరిగింది. ప్రత్యేకించి విధానాలను అనుసరించడంలో వైఫల్యం చోటుచేసుకుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ తన వాస్తవ ’కార్పొరేట్ పర్యావరణ విధానం (సీఈపీ)ని సవరించి 2012 మార్చిలో ఓ సమగ్ర పర్యావరణ విధానాన్ని రూపొందించింది. ఆ తర్వాత దాన్ని 2018 డిసెంబర్‌లో పునర్వ్యవస్థీకరించింది. ఈక్రమంలో సీఐఎల్ అనుబంధ సంస్థల్లో ఆరు బొగ్గుగని సంస్థలు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు విధాన నిర్ణయం అమలు చేయలేదని ఆ నివేదిక వివరించింది.
ఆ సంస్థలకు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం సైతం లభించిన ఈ పర్యావరణ విధానాన్ని తుంగలోతొక్కడంపై సీఏజీ నివేదిక అభ్యంతరం తెలిపింది. అలాగే పర్యావరణానికి సంబంధించి వివిధ స్థాయిల్లో బాధ్యతల నిర్వహణ, ప్రాతినిధ్యంపై ఉన్న సీఐఎల్ మార్గదర్శకాలను ఆ అనుబంధ సంస్థలు తమ ఆరంభ మాన్యువల్‌లో పొందుపరచలేదని తెలిపింది. అంతేకాకుండా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ ర్డ్స్’ (బీఐఎస్) విధించిన పరిమితికి మించి ఈ సీఐఎల్ అనుబంధ కంపెనీల పరిసరాల్లో కాలుష్యం నెలకొందని నివేదిక స్పష్టం చేసింది. 2013 నుంచి 2018 వరకు ఈ కంపెనీలు 62 లక్షల కిలోలీటర్ల మురుగునీటిని విడుదల చేశాయని, దీని మురుగు సాంద్రత అత్యధిక కాలుష్య స్థాయి (ఎంసీఎల్)ని మించి ఉందని, ఇందువల్ల లఖన్‌పూర్, బసుంధరా గనుల పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులన్నీ పాడయ్యాయని, అలాగే భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయని కాగ్ నివేదిక వెల్లడించింది. కోల్ ఇండియా అనుబంధ సంస్థలైన సీసీఎల్, బీసీసీఎల్, ఎస్‌ఈసీఎల్ తమ మైనింగ్ కార్యక్రమాలకు భూగర్భ జలాలను వినియోగించుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాయని, దీనికి ఆ సంస్థలకు కేంద్ర భూగర్భ జల సంస్థ నుంచి ఎలాంటి అనుమతులూ లేవని స్పష్టం చేసింది.
అలాగే ఆ సంస్థలు బొగ్గుగని కార్మికులు నివసించే కాలనీల్లో మురుగునీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని కాగ్ వెల్లడించింది.
పిపావర్‌లోని ఓసీఎం, సీసీఎల్ ప్రాంతాల్లో సరైన మెకానిజం, పారిశ్రామిక శుద్ధీకరణ లేకపోవడంతో ఓవర్‌లోడ్డుతో వస్తున్న ట్రక్కులు, డంపర్లు సఫి నది పక్కన నున్న బ్రిడ్జి వద్ద వ్యర్థాలను వదిలివెళుతున్నాయని, ఆ తర్వాత ఇక్కడ సంబంధిత కంపెనీలు సరైన రీతిలో శుభ్రం చేయడం లేదని, ఈ కారణంగా వ్యర్థాలు నదిలోకి వెళ్లి నీటిని కలుషితం చేస్తున్నాయని కాగ్ తెలిపింది. అలాగే సీసీఎల్‌కు చెందిన కథారా వష్రీ గని కారణంగా దామోదర్ నది కాలుష్యం బారిన పడిందని వెల్లడించింది.