బిజినెస్

మళ్లీ పసిడి పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగారం ధరలు బుధవారం మళ్లీ పరుగందుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు (తులం) బంగారం ధర ఏకంగా రూ.332 ఎగబాకింది. మొత్తం ధర మళ్లీ 39వేల మార్కును దాటి రూ. 39,299గా ట్రేడైంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 38,967 పలికింది. స్పాట్‌గోల్డ్ ధరలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తాజా 3 పైసలు క్షీణించింది. ఇలా రూపాయి మరింత బలహీన పడడంతో బంగారం ధరలు పెరిగేందుకు అవకాశం ఏర్పడిందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో ఓ దశలో రూపాయి విలువ 12 పైసలు క్షీణించించి 71.78గా ట్రేడైంది. కాగా వెండి ధరలు సైతం కిలోపై రూ. 676 పెరిగి మొత్తం ధర రూ. 45,996 నుంచి 46,672కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,483 డాలర్లుగా ట్రేడైంది. ఔన్స్ వెండి ధర 17.27గా ట్రేడైంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలకు బంగారంపై పెట్టుబడులకు ఊతమిచ్చాయి. తాజా రాజకీయ ఉద్రిక్తతల క్రమంలో వచ్చే నవంబర్ 2020 ఎన్నికల తర్వాతే చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించడంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లకంటే బంగారంపై పెట్టుబడే సురక్షితంగా భావించారని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.