బిజినెస్

జియో కొత్త టారిఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రిలయన్స్ జియో బుధవారం కొత్త టారిఫ్‌ను ప్రకటించింది. గత టారిఫ్‌తో పోలిస్తే వివిధ ప్లాన్ల ధర 35 శాతం వరకూ పెరిగింది. అయితే భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల కంటే తమ కొత్త టారిఫ్ 28 శాతం ఖర్చు తక్కువ అని కంపెనీ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. కొత్త టారిఫ్ ప్రకారం 84 రోజులు చెల్లుబాటు అయ్యే ఫ్రీ కాల్స్, రోజుకు 1.5 జీబీ డాటా ప్లాన్ కోసం రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్లాన్ రూ.399కు అందుబాటులో ఉండేది. కాగా, 153 రూపాయల ప్లాన్‌ను 199 రూపాయలకు, అదేవిధంగా 199 ప్లాన్‌ను 249 రూపాయలకు, 299 ప్లాన్‌ను 349 రూపాయలకు, 349 ప్లాన్‌ను 399 రూపాయలకు పెంచింది. 448 రూపాయల ప్లాన్ కోసం ఇకపై 599 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 1,699 ప్లాన్ కోసం 2,199 రూపాయలు చెల్లించాలి. 98 రూపాయల ప్లాన్ 129 రూపాయలకు పెరిగింది. నెలవారీ ఫ్రీ కాల్స్, రోజుకు 1.5 జీబీ కోసం చెల్లించే మొత్తం 199 రూపాయలుగా పేర్కొంది. అయితే ఇదే తరహా సేవలందించడానికి ఇతర కంపెనీలు 249 రూపాయలు వసూలు చేస్తున్నట్లు రిలయన్స్ తన ప్రకటనలో పేర్కొంది.