బిజినెస్

పుంజుకున్న టెలికాం షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారత్ స్టాక్ మార్కెట్లలో సోమవారం జరిగిన లావాదేవీల్లో టెలికాం కంపెనీల షేర్లు భారీగా రాణించాయి. ప్రైవేటు బ్యాంకులు, ఆటో మొబైల్ రంగం షేర్లు దెబ్బతిన్నాయి. స్థూల జాతీయోత్పత్తి బలహీనపడిందన్న నివేదికల నేపథ్యంలో ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగువేశారు. ఫలితంగా బ్యాంకింగ్ ఆటోమొబైల్ షేర్లు తీవ్ర వత్తిడికి లోనయ్యాయి. అదేవిధంగా రిజర్వ్ బ్యాంకు ద్రవ్య వినియోగ సమావేశం కూడా ఇనె్వస్టర్లు వేచి చూసే ధోరణికి అవలంభించడానికి కారణమైంది. నేటి లావాదేవీల్లో వివిధ దశలో ఊగిసిలాడిన సెనె్సక్స్ అంతిమంగా 8.36 స్వల్ప అధిక్యతతో 40,802.17 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 7.85 పాయింట్లు తగ్గి లావాదేవీలు ముగిసేనాటికి 12,048.20 వద్ద ముగిసింది. నేటీ లావాదేవీల్లో భారతీ ఏయిర్ టెల్ షేర్ల విలువ 3.67 శాతం పెరిగి భారీగా లాభాన్ని చేకూర్చింది. అలాగే రిలయన్స్ ఇండిస్ట్రి షేర్లు కూడా 2.28 శాతం పెరిగింది. మంగళవారం నుంచి కొత్త టారీఫ్ రేట్లు అమలుకానున్న నేపథ్యంలో టెలికాం కంపెనీల షేర్లపైనే ఇనె్వస్టర్ల ర్యాలీ కొనసాగింది. ఏయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రిలతో పాటు లాభపడ్డ కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలు కూడా ఉన్నాయి. యస్-బ్యాంక్ షేరు విలువ అత్యధిక స్థాయిలో 6.22 శాతం తగ్గింది. అలాగే బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, సన్ ఫార్మా, టెక్ మహేంద్ర షేర్ల విలువ కూడా 3 శాతం వరకు తగ్గింది.