బిజినెస్

ఐదు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ: నిర్మలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారత పెట్రోలియం సంస్థ ఐదు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అస్సాంలోని నుమోలిఘర్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి ప్రభుత్వ వాటాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించా రు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న 53.29 శాతం వాటాలను ప్రభు త్వం ఉపసంహరించుకుంటుందని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో కేంద్రానికి ఉన్న 63.75 శాతం వాటాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.
*చిత్రం... కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్