బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రైవేటు బ్యాంకులు, ఐటీ, ఇంధన స్టాక్స్ భారీ నష్టాల పాలయ్యాయి. బలహీన జీడీపీ వృద్ధిరేటు అంచనాల ప్రభావం సైతం స్టాక్ మార్కెట్లపై పడిందని విశే్లషకులు భావిస్తున్నారు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం సానుకూలంగానే కదలాడినప్పటికీ మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో మధ్యాహ్నం నుంచి ప్రతికూల దిశగా సాగింది. 72 పాయింట్లు కోల్పోయిన ఈ సూచీ 40,284.19 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 10.95 పాయింట్లు (0.09 శాతం) నష్టాలతో 11,884.50 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ సూచీ పరిధిలోని దాదాపు 29 కంపెనీలు లాభపడగా, 20 నష్టపోయాయి. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంకు అత్యధికంగా 4.08 శాతం నష్టపోయింది. అలాగే బజాజ్ ఆటో, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ దాదాపు 2.05 శాతం నష్టపోయాయి. మరోవైపుభారతీ ఎయిర్‌టెల్, టాటాస్టీల్, సన్‌పార్మా, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, వేదాంత, టాటామోటార్స్ అత్యధికంగా 4.60 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు బెంచ్‌మార్క్‌కన్నా ఎగువన లాభాల్లో కదలాడి 0.44 శాతం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూలతతో మార్కెట్లకు ఊతం వచ్చినా వివిధ అధ్యయన నివేదికలు దేశ ఆర్థికాభివృద్ధి రేటు మరింతగా తగ్గే అవకాశాలున్నట్టు వెలువడడంతో ఆ ప్రభావం ప్రతికూలతకు బాటలు వేసిందని విశే్లషకులు చెబుతున్నారు. అమెరికా-చైనా వాణిజ్య చర్చల ఫలితాలపై సైతం మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరిస్తున్నారు. అలాగే ఆర్థికాభివృద్ధి మందగమనాన్ని గాడిలో పెట్టేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంకు తదుపరి ఏ చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారిందని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ పేర్కొన్నారు. స్వల్ప కాలానికి ఈ ఊగిసలాట కొనసాగవచ్చన్నారు. ఇక రంగాల వారీగా చూస్తే కేపిటల్ గూడ్స్, వాహన, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పారిశ్రామిక సూచీలు 0.68 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈలో టెలికాం, లోహ, వౌలిక పరికరాలు, హెల్త్‌కేర్, వినిమయ సూచీలు 3.42 శాతం లాభపడ్డాయి. అమెరికా-చైనా దేశాలు సుంకాల తగ్గింపుపై అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయన్న వార్తలతో లోహ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఇక ఎన్‌ఎస్‌ఈలో లోహ సూచీ సైతం 1.79 శాతం లాభపడింది. టాటాస్టీల్ 4.41 శాతం, హిండాల్కో 3.33 శాతం, సెయిల్ 2.75 శాతం లాభపడ్డాయి. మార్కెట్లో మొత్తం 1,404 స్టాక్స్ నష్టపోగా, బీఎస్‌ఈలో 1,154 స్టాక్స్ లాభపడ్డాయి. ఇక ఆసియా పరిధిలో హాంగ్‌కాంగ్, టోక్యో, షాంఘై లాభాల్లో ముగియగా, సియోల్ మార్కెట్లు నష్టాలను సంతరించుకున్నాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశా యి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా బలహీనపడి ఇంట్రాడేలో 71.79గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 0.09 శాతం పెరిగి బ్యారెల్ 63.36 డాలర్ల వంతున ట్రేడైంది.