బిజినెస్

మోసపూరిత వాణిజ్యంపై ‘సెబీ’ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: మోసపూరిత వాణిజ్యానికి పాల్పడిన ఆరు కంపెనీలపై కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం రూ. 37.6 లక్షల జరిమానాలు విధించింది. వినాయక ఫిన్‌లీజ్ ప్రైవేటు లిమిటెడ్, హైటెక్ కెమికల్స్ హెరిటేజ్ లిమిటెడ్, గ్రాండ్‌గ్రిండ్ బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్, టాప్‌లైట్ కమర్షియల్స్ లిమిటెడ్, వ్రింకిల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై ఈ మేరకు సెబీ కొరడా ఝళిపించింది. ఒకే రోజు ఓ కంపెనీ లేదా వ్యాపారి ఒక కాంట్రాక్టులోని తన కొనుగోలు, లేదా విక్రయ స్థితిని రివర్స్ ట్రేడింగ్ ద్వారా ఒకే సమాన హోదాగల వ్యక్తికి వర్తింపజేయడం వంటివి ఇందులో చోటుచేసుకున్నాయని సెబీ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ కంపెనీలు నిర్వహించిన రివర్సల్ వాణిజ్యం అసలైన వాణిజ్యవేత్తలతో జరగలేదని, అలాగే సాధారణ వాణిజ్య విధానాలకు తిలోదకాలిచ్చారని సెబీ వ్యాఖ్యానించింది. ఇందువల్ల అక్రమ, తప్పుదోవ పట్టించే వాణిజ్యం జరిగి కృత్రిమ వాల్యూమ్ రూపుదిద్దుకుందని వెల్లడించింది. స్టాక్ ఆప్షన్ల విభాగంలో 2014 ఏప్రిల్ నుంచి 2015 సెప్టెంబర్ వరకు సెబీ నిర్వహించిన విచారణ సందర్భంగా ఈ కంపెనీల రివర్సల్ ట్రేడింగ్‌లో భారీగా అవకతవకలు జరిగినట్టు రుజువైంది. ప్రధానంగా ‘మోసపూరిత, అనుచిత వాణిజ్య విధానాల నియంత్రణ చట్టం నిబంధనలను ఈ కంపెనీలు విస్మరించాయని సెబీ వ్యాఖ్యానించింది. ఈక్రమంలోనే గ్రాండ్‌గ్రింఢ్ బార్టర్ కంపెనీకి రూ. 10.5 లక్షలు, టాప్‌లైట్ కమర్షియల్స్‌కు రూ. 7.1 లక్షలు, మిగిలిన కంపెనీలకు రూ. 5లక్షల వంతున జరిమానా విధిస్తున్నట్టు సెబీ తన తీర్పులో పేర్కొంది. 45 రోజుల్లో ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే వడ్డీతో సహా వసూలుకు, స్థిర, చరాస్తుల విక్రయాల అటాచ్‌మెంట్‌కు చర్యలు చేపట్టాల్సి వస్తుందని సంబంధిత కంపెనీలను సెబీ హెచ్చరించింది.