బిజినెస్

బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారిటోరియం మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: టెలికం కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మూడేళ్ల మారిటోరియం (విరామం) మంజూరు చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (సీఓఏఐ) సోమవారం నాడిక్కడ కోరింది. బకారుూల చెల్లింపునకు గడువును సైతం పొడిగించాలని, వడ్డీలను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేసింది. ‘సవరించిన స్థూల ఆదాయం’ (ఏజీఆర్) పరిధిలో ఉన్న బకారుూలన్నింటినీ టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాలంటూ సుప్రీం తీర్పునిచ్చిన క్రమంలో పలు కంపెనీలు తీవ్ర ఇక్కట్లపాలయ్యాయని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆపరేటర్లకు ప్రస్తుతం ప్రాణ వాయువు అససరం. అందుకే అన్ని రకాల రుణ బకారుూల పునర్వ్యవస్థీకరణ చేయా ల’ని ఆయన పీటీఐతో మాట్లాడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ 4జీ లైసెన్సులకు 11ఏళ్ల విలువ ఉందని, దీంతోబాటు మరో పదేళ్ల ప్యాకేజీని ప్రభుత్వం ఇవ్వాలని, అలాచేస్తే మొత్తం లైసెన్స్ సమయంలోగా టెలికం కంపెనీలు బకాయిలన్నింటినీ చెల్లించేందుకు వీలుంటుందన్నారు. ఏజీఆర్ నిబంధనలను సైతం పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికంలో లిస్టెడ్ టెలికం కంపెనీలు రూ. లక్ష కోట్లకు పైగా సామూహిక నష్టాలను మూటగట్టుకున్నాయన్నారు. గత వారం దేశం లో రెండు అతిపెద్ద టెలికం కంపెనీలు వొడాఫొన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ రూ. 74వేల కోట్ల సా మూహిక నష్టాలను నమోదు చేశాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా రూ. 50,921 కోట్లు, ఎయిర్‌టెల్ రూ. 23,045 కోట్లు వం తున అత్యధిక త్రైమాసిక నష్టాలను నమోదు చేశాయని గుర్తుచేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సైతం రూ. 30,142 కోట్ల నష్టాలపాలైందన్నారు.