బిజినెస్

రిలయన్స్ సహజవాయువులో ఎస్సార్, అదానీ, గెయిల్‌కు భారీ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆర్-క్లస్టర్ కేజీ-డీ 6 బ్లాక్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త క్షేత్రాల నుంచి ఉత్పత్తి కానున్న మెజారిటీ శాతం సహజవాయువు (గ్యాస్)ను ఎస్సార్ స్టీల్, అదానీ గ్రూప్‌తోబాటు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ దక్కించుకున్నాయి. ఒక్కో యూనిట్ 5.1 నుంచి 5.16 డాలర్ల వంతున ఈ కొనుగోళ్లు జరిగాయి. ఐతే ఎరువుల కంపెనీలు వేలం పాటలకు గైర్హాజరయ్యాయి. దీంతో ఏడాదికి కనీసం రూ. 800 కోట్ల సబ్సిడీ కంపెనీలకు ఆదా అయ్యిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఎస్సార్ స్టీల్స్ రోజుకు 2.25 మిలియన్ స్టాండర్ట్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను దిక్కించుకుంది. ఇది దేశ అవసరాల్లో దాదాపు సగం. నవంబర్ 15న జరిగిన ఇందుకు సంబంధించిన వేలం జరిగింది. అలాగే గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్ (జీఎస్‌పీసీ) 1.2 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను దక్కించుకోగా, అదానీ గ్రూప్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ 0.3 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను సొంతం చేసుకున్నాయి. అలాగే ఎరువుల కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ సైతం 0.3 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను దక్కించుకుంది. ఐతే ఎరువుల కంపెనీలు ప్రత్యక్షంగా ఈ వేలంలో పాల్గొనకపోవడంవల్ల అదనపు భారమైన దిగుమతి చేసుకునే ఘనీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) సబ్సిడీ ఆ కంపెనీలకు సమకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ కంపెనీలు దాదాపు 3 ఎంఎఎంఎస్‌సీఎండీ గ్యాస్‌కు (ఎల్‌ఎన్‌జీ దిగుమతి కాంట్రాక్టు)ను దక్కించుకున్నాయి. ఈ మేరకు ఒక్కో బ్రిటీష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబీటీయూ)ను 9 డాలర్ల ధరకు కొనుగోలు చేసి దిగుమతి చేయాల్సివుంటుంది. అలాగే మరో 23 ఎంఎంఎస్‌సీఎండీ దీర్ఘకాలిక కాంట్రాక్టులను సైతం ఎంఎంబీటీయూ 11,5 డాలర్ల వంతున దిగుమతి చేసేందుకు దక్కించుకున్నాయి. ఈ సంస్థలు రిలయన్స్ గ్యాస్‌ను గెయిల్ ద్వారా ఎంఎంబీటీయూ 6.5, లేదా 7 డాలర్ల వంతున సరఫరా ధరకు పొందుతాయి. ఇక హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) 0.35 ఎంఎంఎస్‌సీఎండీ, గుజరాత్ రాష్ట్ర ఎరువులు, రసాయనాల సంస్థ (జీఎస్‌ఎఫ్‌సీ) గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థ సంయుక్తంగా 0.10 ఎంఎంఎస్‌సీఎండీ సహజవాయును దక్కించుకున్నాయి. ఈ టెండర్లలో ఉక్కు, పెట్రోలియం, సిటీ గ్యాస్, గ్లాస్ అండ్ సిరామిక్స్ వంటి రంగాల నుంచి మొత్తం 15 మంది వినియోగదారులు గ్యాస్‌ను దక్కించుకున్నారు. కాగా 2020 ప్రథమార్థాం నుంచి ఆర్-క్లస్టర్‌లోని కేజీ-డీ6 బ్లాక్‌లో వెలికి తీయనున్న గ్యాస్‌లో 5 ఎంఎంఎస్‌ఎండీ గ్యాస్‌ను కొనుగోలు చేసే అర్హతకలిగిన వినియోగదార సంస్థల నుంచి రిలయన్స్, బ్రిటన్‌కు చెందిన దాని భాగస్వామి బీపీ పీఐసీ బిడ్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.