బిజినెస్

ఆర్‌కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: భారీ నష్టాలతో, ఆర్థికంగా దెబ్బతిన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ (ఆర్‌కామ్) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. శనివారం సమర్పించిన ఫైలింగ్‌లో ఈ రాజీనామా అంశం ఉంది. అనిల్‌తోపాటు ఛాయా విరానీ, రీనా కరానీ, మంజరీ కక్కర్, సురేష్ రంగాచార్ కూడా డైరెక్టర్లుగా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఫైనాన్షియల్ డైరెక్టర్‌గా శ్రీమణికంఠన్ ఇది వరకే ఇది వరకే వైదొలిగారు. వీరందరి రాజీనామాలను రుణదాతల కమిటీ ముందు ఉంచామని, వారు ఆమోదిస్తే అధికారికంగా అమల్లోకి వస్తుందని ఆర్‌కామ్ తన ఫైలింగ్‌లో పేర్కొం ది. ఆర్‌కామ్ కంపెనీలో ప్రస్తుతం దివాలా ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 30,142 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ చూపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ వివరాలను ఆర్‌కామ్ ఈ లెక్కలను ప్రకటించింది.
*చిత్రం... అనిల్ అంబానీ