బిజినెస్

చింతపండుకు జీఎస్టీ మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఎండు చింతపండుపై గతంలో ఉన్న ఐదు శాతం జీఎస్టీని తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ఎండు చింతపండుపై జీఎస్టీని మినహాయించాలని కోరుతూ జూలై 24 న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై సెప్టెంబర్ 20న పనాజీలో జరిగిన జీఎస్టీ 37వ మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి ఎండబెట్టిన చింతపండుపై జీఎస్టీని మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వేమిరెడ్డికి మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తిరిగి లేఖ రాశారు. సెప్టెంబర్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు మంత్రి లేఖలో ఆ లేఖలో పేర్కొన్నారు.