బిజినెస్

నష్టాల్లో దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలపాలయ్యాయి. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలు తగ్గడం , కార్పొరేట్ కంపెనీల ఫలితాలు సైతం ఆశించిన స్థాయిలో లేకపోవడం, అమెరికా అధ్యక్షుడి తాజా ప్రకటనతో ఆ దేశం చైనాతో జరుపుతున్న వాణిజ్య చర్చలు ఏ పరిణామాలకు దారిస్తాయన్న అంశంపై తికమక నెలకొనడం, హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతలు మరింత ముదరడం వంటి అంశాలు దేశ, అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో మంగళవారం ఒడిదుడుకులకు గురై స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లోకి జారాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 229.02 పాయింట్లు (0.57 శాతం) నష్టపోయి 40,116.06 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 73 పాయింట్లు (0.57 శాతం) నష్టపోయి 11,840.45 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా 57 పైసలు తగ్గి ఇంట్రాడేలో మొత్తం విలువ కీలక 72 స్థాయికన్నా దిగువకు చేరడం కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఆద్యంతం ఊగిసలాటకు గురైన సెనె్సక్ ఏకంగా 386 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కొంత కోలుకుని చివరిగా 229.02 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 6.51 శాతం నష్టపోయింది. అలాగే ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, వేదాంత, సన్‌పార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సైతం 3.69 శాతం నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్, ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్, మారుతి, ఎన్‌టీపీసీ 3.76 శాతం లాభాలను సంతరించుకున్నాయి. అమెరికా0-చైనా వాణిజ్య చర్చలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ చైనాను ‘వాణిజ్య మోసాకారి’గా అభివర్ణిచడం దుమారం రేపింది. ఇరు దేశాల మధ్య 18 నెలల కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపుగా ఓ మధ్యంత ఒప్పందం కుదురుతుందని ఇటీవలే భరోసా ఇచ్చిన ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో అయోమయాన్ని సృష్టించింది. ఈక్రమంలో ప్రధానంగా ఆసియా మార్కెట్లలో ప్రకంపనలు రేగి నష్టాల పాలయ్యాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు 1.82 శాతం నష్టాలతో ముగిశాయి. ఇక దేశీయ పరిశ్రమల ఫలితాలు సైతం బలహీనంగా ఉండడం సైతం మార్కెట్ మూడ్‌ను ప్రభావితం చేశాయి. పారిశ్రామికోత్పత్తి గడచిన సెప్టెంబర్‌లో 4.3 శాతం తగ్గడం, తయారీ రంగంలో ఏడేళ్ల కనిష్ట స్థాయి పనితీరును, సామర్ధ్యం నమోదవడం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ప్రధానంగా గనులు, విద్యుత్ రంగాల్లో ప్రగతి కొరవడడం తయారీ రంగాన్ని దెబ్బతీసింది. బుధవారం పొద్దుపోయిన తర్వాత వెలువడే వినియోదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాలపైనే ప్రధానంగా వాణిజ్య వర్గాలు దృష్టి నిలిపాయి. ఈ ఏడాది దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు అంచనాలను ఎస్‌బీఐ పరిశోధక విభాగం మరింతగా (5శాతానికి) తగ్గించడం మార్కెట్లకు మరో ప్రతిబంధకంగా నిలిచింది. ఇక ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1.22 శాతం తగ్గి బ్యారెల్ 61.30 డాలర్ల వంతున ట్రేడైంది.