బిజినెస్

ఆదాయ పన్నుపై సూచనలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: కేంద్ర ఆర్థిక మంత్రి త్వ శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను రూపొందించే కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో చేయవలసిన మార్పుల గురించి సూచనలు ఇవ్వవలసిందిగా పరిశ్రమ వర్గాలను, వాణిజ్య సంస్థలను కోరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇలా సూచనలు ఇవ్వాల్సిందిగా కోర డం బహుశా ఇదే మొదటిసారి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత నెల రోజుల్లోనే మందగిస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి అదనపు చర్యలు ప్రకటించారు. ఆమె ఇప్పుడు 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన 2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు, భాగస్వాములతో బడ్జెట్‌కు ముందు సంప్రదింపులను జరుపుతుండగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ బహుశా తొలిసారి వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు చెల్లించవలసిన ఆదాయపు పన్ను రేట్లలో, ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వంటి పరోక్ష పన్నుల్లో చేయవలసిన మార్పుల గురించి సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ‘సుంకాల స్వరూపం, రేట్లలో చేయవలసిన మార్పులతో పాటు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు ఆర్థిక న్యాయం కల్పిస్తూ వాటి పన్ను పునాదిని విస్తరించడానికి సూచనలు ఇవ్వవలసింది’గా పరిశ్రమ, వాణిజ్య సంస్థలను నవంబర్ 11వ తేదీన జారీ చేసిన సర్క్యులర్‌లో రెవెన్యూ శాఖ కోరింది. ‘మీ సూచనలు, దృక్పథాలతో పాటు వాటిని బలపరిచే ఉత్పత్తి, ధరలు, సూచనలను ఆమోదిస్తే ఆదాయంపై పడే ప్రభావంతో పాటు మీ ప్రతిపాదనలను సమర్థించే ఇతర ఏదైనా సమాచారాన్ని పంపించొచ్చు’ అని రెవెన్యూ శాఖ తన సర్క్యులర్‌లో పేర్కొంది. జూలై అయిదో తేదీన తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 20న దేశీయ కార్పొరేట్ కంపెనీల ఆదాయపు పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చర్య వల్ల కేంద్ర ప్రభుత్వానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.45 లక్షల కోట్ల ఆదాయానికి గండి పడింది. వ్యక్తుల ఆదాయపు పన్ను రేట్లను తగ్గించి, సామాన్యుడి చేతిలో మరింత డబ్బు ఉండేట్లు చూడాలని, తద్వారా వినిమయం ఆధారంగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపచేయాలనే డిమాండ్‌లు ఉన్నాయి.