బిజినెస్

అరకు పర్యాటకులకు ప్రత్యేక రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి వచ్చే పర్యాటకుల కోసం విశాఖ-అరకు మధ్య ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య తెలిపారు. విశాఖలోని హరిత భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యాటక శాఖ, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి ప్రత్యేక రోజువారీ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ-అరకు ప్రాంతాల మధ్య ఉన్న స్థానిక పర్యాటక ప్రాంతాలను పర్యాటకులు చూసే విధంగా రైల్ కమ్ రోడ్డు సర్వీసులతో ప్యాకేజీని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను, బుకింగ్ సదుపాయాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు.
ఒక రోజు ప్యాకేజీ వివరాలు
విశాఖ- అరకు ప్రాంతాల మధ్య ఒక రోజులో చూసే విధంగా పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనికి ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చామని, దీనిలో నాలుగు ఎగ్జిక్యూటివ్ క్లాస్ బోగీలు, స్లీపర్ క్లాస్‌లు-3, సెకండ్ స్లీపర్ క్లాస్-10 బోగీలు అందుబాటులో ఉంటాయన్నారు. విశాఖ నుంచి ఉదయం బయలుదేరే ఈ రైలు ప్రయాణికులతో అరకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, పద్మావతి గార్డెన్స్‌కు పర్యాటకులను తీసుకెళ్తారు. అక్కడ మధ్యాహ్న భోజనం అనంతరం రోడ్డు మార్గం ద్వారా అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలు తిలకించిన తరువాత తిరిగి విశాఖ రైల్వే స్టేషన్‌కు తీసుకొస్తారని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
ప్యాకేజీ ధరల వివరాలు
విశాఖ-అరకు రైల్ కమ్ రోడ్డు మార్గం ద్వారా త్వరలో అందుబాటులోకి రానున్న ప్యాకేజీ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విస్టాడోమ్ కోచ్‌లో పెద్దలకు రూ.2,467, పిల్లలకు రూ.2,215, స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.1,664, పిల్లలకు రూ.1,412, రెండో తరగతి స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.1,589, పిల్లలకు రూ.1,337 గా ధరలను నిర్ణయించామన్నారు. వీరికి రైల్ కమ్ రోడ్డు మార్గం ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ కూడా అందిస్తామన్నారు.
జనవరి 3 నుంచి భారత్ దర్శన్ రైలు ప్రారంభం
ఈస్ట్‌కోస్ట్, సౌత్ సెంట్రల్, సౌత్ కోస్ట్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించే విధంగా దక్షిణ భారతయాత్ర సాగించే విధంగా వచ్చే ఏడాది జనవరి 3 నుంచి భారత్ దర్శన్ పేరిట ప్రత్యేక పర్యాటక రైలును ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీ జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. ఈ రైలులో 12 స్లీపర్ కోచ్‌లు, మూడు థర్డ్ ఎసీ కోచ్‌లు, ఒక ప్యాంట్రీకార్, రెండు గార్డ్ కోచ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ రైలులో ప్రయాణించే వారికి రోజుకు రూ.945 చార్జీ చేస్తామని, ఎన్ని రోజులు ప్రయాణిస్తే దానికి అనుగుణంగా ఐఆర్‌సీటీసీకి డబ్బులు చెల్లించాలన్నారు. రూ. 945ల్లోనే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఏప్రిల్ 1 నుంచి విశాఖ పర్యాటకుల కోసం ఈ భారత్ దర్శన్ రైలు ప్రారంభిస్తామని, పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. త్వరలోనే విశాఖ- షిర్డీ ప్రయాణికులు, పర్యాటకుల డిమాండ్ దృష్ట్యా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక రైలును నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఐఆర్‌సీటీసీ ప్రతినిధులు డి.నరసింగరావు, విశాఖ పర్యాటక శాఖాధికారి ప్రసాదరెడ్డి, ఏరియా మేనేజర్ పాల్గొన్నారు.
*చిత్రం... మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఐఆర్‌సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య