బిజినెస్

బంగారం ఈటీఎఫ్‌ల నుంచి రూ. 31కోట్లు ఉపసంహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: మదుపర్లు గడచిన అక్టోబర్ మాసంలో ‘బంగారు మారక వాణిజ్య నిధి’ (ఈటీఎఫ్‌లు) నుంచి రూ. 31 కోట్లు ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు రెండు నెలల కాలంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానే్న పెట్టుబడులకు భత్రతతో కూడిన మార్గంగా భావించి రూ. 200 కోట్లు మదుపుచేశారు. తాజా పరిస్థితుల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. గత సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ. 44.11 కోట్ల పెట్టుబడులు రాగా, ఆగస్టులో రూ.145.29 కోట్లు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన రూ. 10 కోట్ల పెట్టుబడుల తర్వాత ఆగస్టులో వచ్చిన పెట్టుబడులే అధికం కావడం గమనార్హం. అంతకు ముందు ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 2016 అక్టోబర్‌లో రూ. 20 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దానికంటే ముందు 2013 మేలో వచ్చిన రూ. 5 కోట్ల పెట్టుబడులే అధిక శాతంగా ఉండేది.
అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొనడం, అంతర్జాతీయ స్థూల ఉత్పత్తి రేటు (జీడీపీ) అంచనాలు ఆశించిన స్థాయికన్నా తక్కువగా ఉండడం తదితర కారణాలు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు పెరిగాయని విశే్లషకులు పేర్కొంటున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఎఎంఎఫ్‌ఐ) గణాంకాల మేరకు గత నెలలో బంగారంతో అనుసంధానమైన ఈటీఎఫ్‌ల్లోకి రూ. 31.45 కోట్ల నిధులు పెట్టుబడులుగా వచ్చాయి. 2011-12 సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడి ధరలు వేగంగా పెరిగిన బంగారానికి ఆ తర్వాత ఆదరలో స్తబ్థత నెలకొంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా అంతగా డిమాండ్ లేదు. ఐతే తాజాగా ఈ ఏడాది బంగారానికి డిమాండ్ నెలకొని మదుపర్లకు పెట్టుబడులకు మార్గంగా మారిందని ప్రముఖ విశే్లషకుడు హింమాంన్షు శ్రీవాత్సవ తెలిపారు. ప్రత్యేకించి గడచిన ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పెట్టుబడులు పెరిగాయన్నారు. అలాగే అక్టోబర్ చివరికి బంగారం నిధుల ఆస్తుల విలువ (‘అస్సెట్ అండర్ మేనేజ్‌మెంట్) రూ. 5,652 కోట్లు కాగా సెప్టెంబర్‌లో ఈ ఆస్తుల విలువ రూ. 5,613 కోట్లుగా ఉంది. కాగా గడచిన ఆరేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే బంగారం లింక్ ఉన్న ఈటీఎఫ్‌ల్లోకి కేవలం ఐదు నెలల కాలంలోనే గణనీయంగా పెట్టుబడులు వచ్చాయి. గడచిన 2018లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి మదుపర్లు రూ. 571 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. అంతకు ముందు 2017లో రూ. 730 కోట్ల మొత్తం ఉపసంహరించుకోవడం జరిగింది.