బిజినెస్

ఐటీ రంగంలో ప్రత్యేక సెజ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: సమాచార సంకేతిక (ఐటీ) రంగంలో ప్రత్యేక ఆర్థిక జోన్లు (సెజ్‌లు) ఏర్పాటుకు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు వేర్వేరుగా సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం వచ్చే శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెజ్‌లపై అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన విభాగం ‘బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్’ ఈనెల 15 జరిగే సమావేశంలో ఈప్రతిపాదనలపై చర్చించనుంది. ఈ అంతర్గత మంత్రిత్వ శాఖల విభాగానికి (బోర్డుకు) కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అధ్యక్షుడుగా ఉన్నారు. కాగా తమిళనాడులోని కాంచీపురంతోబాటు పూణేలో రెండు సెజ్‌లను ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్ ప్రతిపాదించిందని బోర్డు సమావేశ అజెండాలోని అంశాలను బట్టి తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూణే ప్రాజెక్టుకు రూ. 361.53 కోట్లు ఖర్చు అంచనాలను పొందుపరిచారు. అలాగే కాంచీపురం ప్రాజెక్టుకు రూ. 336 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇందుకు సంబంధించి కాంచీపురం జిల్లాలోని 5.37 హెక్టార్లలో ఐటీ, ఐటీఈఎస్‌ల ఏర్పాటుకు లాంఛన ప్రాయమైన అంగీకారాన్ని ఇన్ఫోసిస్ కోరుతోంది. ఇక టీసీఎస్ లిమిటెడ్స్ సైతం రూ. 900 కోట్లు ఖర్చయ్యే ప్రత్యేక సెజ్‌ను ఏర్పాటుకు తద్వారా 12 వేల మందికి ఉపాధి అవకాశాల కల్పనకు ప్రతిపాదించింది.