బిజినెస్

5 శాతానికి కుదింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 12: ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు అంచనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక పరిశోథనా విభాగం తాజాగా 5 శాతానికి కుదించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంటుందని గతంలోప్రకటించిన ఈ విభాగం తాజాగా ఆ అంచనాలను సవరించి 5 శాతానికి కుందించడం విశేషం. ఈమేరకు ఆ పరిశోధనా బృంద నివేనిక ‘ఈసీఓడబ్ల్యుఆర్‌ఏపీ’ మంగళవారం నాడిక్కడ విడుదలైంది. ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతానికి పడిపోయే అవకాశాలున్నాయని ఆ నివేదిక అంచనా వేసింది. మోటారు వాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోవడం, వైమానిక రంగంలో కూడాప్రగతికి ప్రతిబంధకాలు నెలకొని విమానాల రాకపోకల శాతం తగ్గిపోవడం, కీలక రంగాల్లో వృద్ధిరేటులో స్తబ్థత నెలకొనడం, నిర్మాణ, వౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వంటి కారణాలను బేరీజు వేసుకుని తాజాగా జీడీపీ వృద్ధిరేటును కుదించడం జరిగిందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఐతే 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు పుంజుకుంటుందని, 6.2 శాతానికి చేరుతుందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత వృద్ధిరేటు మందగమనాన్ని చక్కదిద్దాలంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రానున్న డిసెంబర్ ద్రవ్య వినిమయ విధాన సమీక్షా సమావేశంలోనూ తర్వాత కూడా మరిన్ని దీర్ఘకాలిక రేట్ల కోతలను చేపట్టాల్సిన అవసరం ఉందని సూచింది. గత నెలలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇలా ఇప్పటికే ఐదు సార్లు ఆర్బీఐ రెపోరేట్ల కోత జరిగింది. కాగా ఆర్బీఐ సైతం 2019-20 జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించడం జరిగింది. ప్రథమ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు అంచనాలు ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి చేరడంతో తమ తొలి అంచనాలపై మళ్లీ సమీక్షించాల్సి వచ్చిందని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 4.2 శాతానికి తగ్గుతుందనడానికి మొత్తం 33 ప్రధాన సూచికల వృద్ధిరేటును 2018 అక్టోబర్ నుంచి పరిశీలించామని 2019 సెప్టెంబర్ నాటికి వాటి వృద్ధిరేటు 17 శాతానికి పడిపోయిందని నివేదించింది. ఐతే అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థికాభివృద్ధి మందగమనం నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సివుందని పేర్కొంది. అన్ని దేశాలూ 22 నుంచి 761 బేసిస్ పాయింట్ల మేర రెపోరేట్ల కోత విధించాయని, ఇందులో భారత్‌కూడా ఒకటైనందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక భరోసా ఇచ్చింది.
‘మూడీస్’ నివేదిక సైతం సానుకూలత నుంచి ప్రతికూలత వైపు అంచనాలను కుదించినప్పటికీ దాని ప్రభావం దేశ వృద్ధిరేటుపై ఉండబోదని, ఇందుకు భారత స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపిస్తుండడమేనని స్పష్టం చేసింది. డిసెంబర్ 5న జరిగే ఆర్బీఐ ద్రవ్యవినిమయ విధాన సమీక్షా సమావేశంలో మరో పెద్ద రేట్ల కోత తప్పక పోయినా అలాంటి కోతల వల్ల తక్షణమే ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆర్థిక రంగ బలోపేతానికి, రుణాల వసూళ్లకు, గృహ కొనుగోళ్లకు ప్రోత్సాహాన్ని దీర్ఘకాలంలో అందజేసే వీలుందని నివేదిక తెలిపింది. దేశంలో డిమాండ్‌ను పెంచేందుకు అనుగుణంగా ఆర్థిక విధానాల్లో మార్పు జరిగేలా ఆర్థిక నిపుణులు కృషి చేయాలని సూచించింది.