బిజినెస్

స్వల్ప లాభాలతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్పంగా లాభపడ్డాయి. రోజంతా ఒడిదుడుకులతో సాగిన సూచీలు బ్యాం కింగ్ స్టాక్స్ తెచ్చిన లాభాలతో ఎట్టకేలకు లాభాలను నమోదు చేశాయి. హాంగ్‌కాంగ్‌లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియా ఈక్విటీలు స్వల్పంగా నష్టాల పాలవడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొడం కూడా ఆసియా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది. ఆరంభంలో లాభాల వైపు సాగిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 266 పాయింట్లు అదనంగా ఎగబాకింది. అయితే తర్వాత ఒడిదుకులకు లోనై కిందికి దిగి వచ్చింది. 21.47 పాయింట్ల (0.05 శాతం) స్వల్ప లాభంతో 40,345.08 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కేవలం 5.30 పాయింట్ల (0.04 శాతం) లాభంతో 11,913.45 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లో యెస్ బ్యాంక్ అత్యధికంగా 5.80 శాతం లాభపడింది. అలాగే టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ సైతం లాభాలను సంతరించుకున్నాయి. మరోవైపు హీరో మోటోకార్ప్, వేదాంత, టీసీఎస్, ఆర్‌ఐఎల్, ఏసియన్ పెయింట్స్, మారుతి, ఎం అండ్ ఎం 2 శాతం నష్టపోయాయి. మంగళవారం గురునానక్ జయంతి, కార్తీక పున్నమి సందర్భంగా మార్కెట్లకు సెలవు. కాగా గడచిన వారం రోజులుగా ఉన్న మార్కెట్ సానుకూల స్థితిగతులు మదుపర్లలో విశ్వాసాన్ని కొనసాగించాయని, ఐతే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులు ఆచితూచి అడుగేసేలా చేశాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా నెలవారీ పారిశ్రామికోత్పత్తి గణాంకాల కోసం కూడా మదుపర్లు ఎదురు చూస్తున్నారు.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
3చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించుకునేందుకు తాను అంగీకరించబోన2ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతికి బ్రేకులు వేశాయి. అమెరికా-చైనా చర్చల్లో ఓ ప్రధాన సానుకూల ఒప్పందం జరుగనుందని ఇటీవలే ప్రకటించి మార్కెట్లలో ఆశలు రేపిన ట్రంప్ తాజాగా తన వైఖరి మార్చడం విశేషం. ఈక్రమంలో అధిక శాతం ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల పాలయ్యాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు 2.62 శాతం నష్టపోయాయి. హాంగ్‌కాంగ్‌లో నిరసన హింసాత్మకంగా మారడం కూడా మార్కెట్లకు ప్రతికూలంగా మారిందని విశే్లషకులు భావిస్తున్నారు. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 18 పైసలు నష్టపోయి ఇంట్రాడేలో 71.47గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 1.04 శాతం తగ్గి బ్యారెల్ 61.87 డాలర్ల వంతున ట్రేడైంది.