బిజినెస్

‘నెఫ్ట్’పై చార్జీలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: నేషనల్ ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) ద్వారా నగదు బదిలీలు చేసేవారికి శుభవార్త. వచ్చే 2020 జనవరి నుంచి ఈ నగదు బదిలీకి బ్యాంకులకు ఎలాంటి చార్జీలూ చెల్లించక్కర్లేదు. ఈమేరకు వచ్చిన ప్రతిపాదనలకు రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. పెద్దనోట్ల రద్దు (డీ మోనిటరైజేషన్) జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని డిజిటల్ లావాదేవీలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు ఆర్బీఐ తెలిపింది. ఐతే టోల్ ఫీజ్ కలెక్షన్ సిస్టం ‘్ఫస్టాగ్స్’లో పార్కింగ్ ఫీజు వసూలు చేసేందుకు, అలాగే ఫ్యూయల్ స్టేషన్లలో సైతం పార్కింగ్ ఫీజు వసూలుకు సెంట్రల్ బ్యాంకు అందజేసిన ప్రతిపాదనలకు ఆర్బీఐ ఆమోద ముద్ర వేసింది. కాగా 2018 అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2019 వరకు మొత్తం నగదు రహిత రీటెయిల్ చెల్లింపుల్లో 96 శాతం డిజిటల్ చెల్లింపులు జరిగాయి. అదే కాలంలో ‘నెఫ్ట్’ ద్వారా 252 కోట్ల లావాదేవీలు, యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా 874 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాదిపదికన ఇందులో 20 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఇందుకోసం ఆర్బీఐ వరుసగా ‘ఇంటర్-ఆలీయా’ వంటి సదుపాయాల కల్పనకు అనేక చర్యలు చేపట్టిందని శుక్రవారం నాడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో ఆ బ్యాంకు గుర్తు చేసింది. కాగా సేవింగ్స్ బ్యాంకు ఖాతాలున్న వారికి ఆన్‌లైన్ లావాదేవీల్లో అందజేసే సేవలను నెఫ్ట్ విధానంలో జనవరి 1 తర్వాత కూడా ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించాలని ఆర్బీఐ సూచించింది. అలాగే వినియోగదారుల క్యూఆర్ కోడ్స్, మెరిట్స్ వంటి వాటి అవసరాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది. అలాగే అన్ని అధికారిక చెల్లింపుల విధానాలను, పరికరాలను (నాన్ బ్యాంక్ పీపీఐలు, కార్డ్‌లు, యూపీఐల వంటివి) అనుమతించాలని నిర్ణయించింది. దీనికి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్స్‌తో అనుసంధానం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈవిధానం ద్వారా పార్కింగ్, ఫ్యూయల్ తదితర చెల్లింపులను అంతర్గత నిర్వహణలతో కూడిన వాతావరణంలో నిర్వహించాలని భావిస్తోంది. కాగా 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మకంగా చేపట్టిన పెద్దనోట్ల (రూ. 500, రూ. 1000) రద్దు బృహత్ కార్యక్రమానికి శుక్రవారంతో సరిగ్గా మూడేళ్లు నిండిన సందర్భంగా ఆర్బీఐ ఇందుకు సంబంధించిన వార్షికోత్సవం నిర్వహిస్తూ డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.
లాభాలతో ముగిసిన వాణిజ్య వారం
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారంలో మొత్తం ఐదు రోజుల్లో మూడు రోజుల పాటు రికార్డు స్థాయి గరిష్ట లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 12వేల మార్కును సైతం దాటిన సంగతి తెలిసిందే. కాగా ఈ యాక్షన్ ప్యాక్డ్ వారం మార్కెట్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. సెనె్సక్స్ 158.58 పాయింట్లు (0.39 శాతం) లాభపడగా, నిఫ్టీ 17.55 పాయింట్ల (0.14 శాతం) అధిక్యతను సాధించింది. ఐతే చివరి రోజు జీవితకాల రికార్డు గరిష్టం నుంచి నష్టాల్లోకి జారడం వాణిజ్య వర్గాలను కలవరపరిచింది.