బిజినెస్

ఆరు నెలల్లో 9శాతం పెరిగిన ఈటీఎఫ్ ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రస్తుతం పెరిగిన మదుపర్ల ఆసక్తి నేపథ్యంలో మారకద్రవ్య వాణిజ్య నిధులు (ఈటీఎఫ్‌లు), జాతీయ స్టాక్ ఎక్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో ఆస్తుల ఆధారిత సెక్యూరిటీల విలువ గత ఆరు నెలల కాలంలో తొమ్మిది శాతం పెరిగి మొత్తం రూ. 1.5 లక్షల కోట్లకు చేరింది. గడచిన సెప్టెంబర్‌తో ముగిసిన అర్థ సంవత్సర కాలానికి ఈ గణాంకాలు వెలువడ్డాయి. ఈ కాలంలో మొత్తం 71 ఈటీఎఫ్‌లు పలు ఈక్విటీలు, రుణ మార్కెట్లలో ప్రామాణికతగా మారాయి. గడచిన మార్చి నాటికి ఈ సంఖ్య 66గా ఉంది. ఈటీఎఫ్‌లపై పెరిగిన అవగాహనతోబాటు లార్జ్‌క్యాప్ ఆక్టివ్ ఫండ్స్ సంబంథిత ఆధారిత సూచలు సక్రమంగా ఫలితాలను నమోదు చేయకపోవడం, ఈటీఎఫ్‌లకు తగ్గించిన ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు వంటి కొన్ని అంశాలు ఈ పరిస్థితికి ఊతమిచ్చాయని ఎన్‌ఎస్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది.