బిజినెస్

ఆల్ టైం గరిష్టానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ గురువారం మరోదఫా జీవితకాల గరిష్ట స్థాయి లాభాలను నమోదు చేసింది. అలాగే నిఫ్టీ ఐదు నెలల తర్వాత 12 వేల మార్కును దాటింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన తాజా సంస్కరణలు మదుపర్లలో సానుకూల దృక్పథాన్ని కలిగించగా, మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో ప్రగతి కూడాప్రపంచ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 183.96 పాయింట్లు (0.45 శాతం) లాభపడి జీవితకాల ఇంట్రాడే రికార్డు స్థాయి గరిష్టం 40,688.27 పాయింట్ల వద్ద స్థిరపడింది. లోహ, ఇంధన, బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 46 పాయింట్లు (0.38 శాతం) లాభపడి 12,012.05 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. గత జూన్ 4న ఈ సూచీ ఇలా 12వేల మార్కును దాటగా ఆ తర్వాత ఇప్పుడీ రికార్డు నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన 1,600 గృహ నిర్మాణ ప్రాజెక్టులకు బాసటగా రూ. 25 వేల కోట్ల నిధులు మంజూరుకు బుధవారం పొద్దుపోయిన తర్వాత ఆమోద ముద్ర వేయడంతో స్టాక్ మార్కెట్లకు ఊతం లభించిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల స్థిరాస్తి, దాని అనుబంధ రంగాలకు వినిమయ శక్తి పెరిగి అభివృద్ధి చోటుచేసుకుంటుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థల త్రైమాసిక లాభాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండడం, భారీగా విదేశీ పెట్టుబడులు రావడం దేశీయ మార్కెట్లకు కలిసొచ్చిందంటున్నారు. ఇక అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందని, దిగుమతి సుంకాలను దశలవారీగా రద్దు చేసేందుకు ప్రణాళిక రూపొందుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం మొత్తం అంతర్జాతీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. కాగా గురువారం దేశీయ మార్కెట్లలో సన్‌పార్మా అత్యధికంగా 3.02 శాతం లాభపడింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 1,064.09 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం వాటాలకు సానుకూలంగా మారింది. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఐటీసీ, వేదాంత, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్పోసిస్ సైతం 2.88 శాతం లాభపడ్డాయి. మరోవైపు యెస్‌బ్యాంక్, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, టాటామోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్‌టీసీసీ అత్యధికంగా 3.27 శాతం నష్టపోయాయి. ఇక రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో ఇంధనం, లోహ, స్థిరాస్తి, వినిమయ వస్తువులు, టెలికాం, హెల్త్‌కేర్ సూచీలు 0.96 శాతం లాభపడ్డాయి. మరోవైపు సహజవాయువులు, వినిమయాలు, వాహన సూచీలు 0.69 శాతం నష్టపోయాయి.
లాభపడ్డ విదేశీ మార్కెట్లు
చైనా-అమెరికా వాణిజ్య చర్చలు ఫలప్రదం కావడంతో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలను నమోదు చేశాయి. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా 5పైసలు బలపడి ఇంట్రాడేలో 70.92గా ట్రేడైంది. ముడిచమురు ధరలు 1.38 శాతం వృద్ధితో బ్యారెల్ 62.59గా ట్రేడైంది.