బిజినెస్

13 శాతం లాభపడిన ఇండియన్ బ్యాంకు వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఇండియన్ బ్యాంకు వాటాలు తాజా బుధవారం 13 శాతం అదనంగా లాభపడ్డాయి. తాజాగా వెలువడిన త్రైమాసిక ఫలితాల్లో ఈ కంపెనీ ద్విగుణీకృత లాభాలను నమోదు చేయడంతో ఆ ప్రభావం స్టాక్‌మార్కెట్లోని ఆ బ్యాంకు వాటాలకు సానుకూలంగా మారిం ది. ఈక్రమంలో బీఎస్‌ఈలో13.23 శాతం లాభపడిన వాటా ధర రూ. 142.90కు చేరిం ది. ఒక దశలో ఈవాటా 17.67 శాతం లాభపడి విలువ 148.50 రూపాయలకు చేరింది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ వాటా విలువ 10.80 శాతం పెరిగి రూ. 139.95కు చేరింది. గత సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంకు మొత్తం రూ. 358.56 కోట్ల లా భాలను నమోదు చేసింది. గతేపాది ఇదే కాలంలో ఈ బ్యాంకు రూ. 150.1 కోట్ల లా భాలను నమోదు చేయగా తాజాగా ఆ లాభాలు ద్విగుణీకృత స్ధాయికి చేరాయి. కా గా తాజా త్రైమాసికంలో ఈ బ్యాంకు రూ. 6,045.32 కోట్ల ఆదాయాన్ని సంతరించుకుం ది. గతేడాది ఇదే కాలంలో రూ. 5,129.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. అలాగే ఆస్తులు కూడా ఈ మూడు నెలల కాలంలో స్ధిరంగా ఉన్నాయని, మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తులు 7.20 శాతం మేర స్వల్పంగా వృద్ధి చెందాయని తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఈ నిరర్థక ఆస్తుల విలువ 7.16 శా తంగా ఉండేదని బ్యాంకు నివేదించింది.