బిజినెస్

మెరిసిన ఐటీ, ఫైనాన్స్ స్టాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒకరోజు విరామానంతరం బుధవారం మళ్లీ లాభాల బాటలోకి మళ్లాయి. ఐటీ, ఫైనాన్స్, వాహన స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఓవైపు మార్కెట్ల స్థితి మిశ్రమంగా ఉన్నా దేశీయ కార్పొరేట్ కంపెనీల సంతృప్తికర త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు సానుకూలంగా మారాయి. ఆరంభం నుంచి లాభాల ట్రెండ్‌ను కొనసాగించిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 330 పాయింట్లు ఎగబాకింది. ఐతే తర్వాత ఒడిదుడుకులకు గురై 39,196.67 పాయింట్ల గరిష్టాన్ని, 38,866.08 పాయింట్ల కనిష్టాన్ని స్పృశించింది. చివరిగా 94.99 పాయింట్ల ఆధిక్యత (0.24శాతం)తో 39,058.83 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 15.75 పాయింట్ల (0.14శాతం) స్వల్ప లాభంతో 111,604.10 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. హెచ్‌సీఎల్ టెక్ సెనె్సక్స్ ప్యాక్‌లో అత్యధికంగా 2.93 శాతం లాభపడింది. ఆ కంపెనీ సానుకూల త్రైమాసిక ఫలితాలే ఇందుకు దోహదం చేశాయి. అలాగే మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్ సైతం 2.55 శాతం లాభపడ్డాయి. ఇలావుండగా మంగళవారం తీవ్రంగా నష్టపోయిన ఇన్ఫోసిస్ వాటాలు బుధవారం కోలుకున్నాయి. 1.16 శాతం లాభపడ్డాయి. కంపెనీ శ్రేయస్సుకోరే అజ్ఞాత ఉద్యోగుల బృందం పేరిట వెలువడిన లేఖ ప్రకంపనలు సృష్టించడంతో ఇన్ఫోసిస్ వాటాలు మంగళవారం భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇలావుండగా భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్ బుధవారం భారీగా 3.59 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. ఎంపికచేసిన లార్జ్‌క్యాప్స్‌లో ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్‌లో వాటాల కొనుగోళ్లు భారీగా జరగడంతో మార్కెట్లు రోజంతా లాభాల బాటలో నడిచాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే వాహన, వినిమయ స్టాక్స్ కూడా కోలుకోవడం కనిపించింది. ఇందుకు ముఖ్యంగా కార్పొరేట్ పన్నుల్లో కోత, త్రైమాసిక ఫలితాల్లో సంతృప్తికర ఆదాయ వృద్ధి నమోదు వంటి అంశాలు దోహదం చేశాయని ప్రముఖ విశే్లషకుడు వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్ విలువలు సైతం పెరుగుతుండటం వల్ల ఇక రీరేటింగ్ నిర్వహించాల్సిన అవసరం కూడా రావచ్చని ఆయన అంచనా వేశారు. రంగాల వారీగా చూస్తే బీఎస్‌ఈలో వాహన, ఐటీ, వినిమయ వస్తువులు, విద్యుత్, శీఘ్రవిక్రయ వినిమయ వస్తువులు (ఎఫ్‌ఎంసీజీ), టెక్, ఫైనాన్స్ సూచీలు 3.04 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్ సూచీ స్వల్పంగా నష్టపోయింది. స్మాల్‌క్యాప్ సూచీ మాత్రం 0.25 శాతం లాభపడింది.
మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్లు
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం నాడు కీలక బ్రెగ్జిట్ బిల్ టైంటేబుల్ ఓటు హక్కును కోల్పోవడంతో అంతర్జాతీయంగా మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఈ నెలాఖరుకల్లా బ్రిటన్ వైదొలగేందుకు దాదాపుగా చర్చలు తుదిదశకు చేరిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయి. ఐరోపా మార్కెట్లది సైతం ఆరంభ ట్రేడింగ్‌లో అదేతీరు. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ స్వల్పంగా పెరిగి ఇంట్రాడేలో 70.92గాట్రేడైంది. ముడిచమురు ధరలు 0.85 శాతం తగ్గి బ్యారెల్ 59.19 డాలర్ల వంతున ట్రేడైంది.