బిజినెస్

హవెల్స్ త్రైమాసిక లాభం రూ. 179.51 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: విద్యుత్ పరికరాల తయారీ సంస్థ హవెల్స్ ఇండియా బుధవారం త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం రూ. 179.51 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కంపెనీకి రూ. 179.70 కోట్ల లాభం సమకూరగా తాజాగా అది స్వల్పంగా తగ్గింది. నిర్వహణ (ఆపరేషన్స్) విభాగం ఆదాయం 1.75 శాతం పెరిగి రూ. 2,232.65 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయం రూ. 2,194.13 కోట్లుగా ఉండేది. కాగా తమ సంస్థ వినిమయ వాణిజ్యం ఎల్‌ఈడీ టీవీలు మినహా మిగిలిన అన్ని రంగాల్లో సంతృప్తికర వృద్ధిని, పనితీరును కనబరుస్తోందని హవెల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రాయ్ గుప్తా ఈ సందర్భంగా చెప్పారు. కంపెనీ మొత్తం వ్యయం రూ. 2,055.74 కోట్లకు చేరిందని, గతంలో ఇదే త్రైమాసికంలో ఈ వ్యయం రూ. 1,978.19 కోట్లుగా ఉండేదని ఆయన వివరించారు.