బిజినెస్

ఈ నెలలో భారీగా విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఈనెలలో మనదేశ ప్రధాన మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 5,072 కోట్ల మొత్తాన్ని మన దేశీయ కేపిటల్ మార్కెట్లలో మదుపు చేశారు. దేశీయంగా డిమాండ్‌ను పెంచేందుకు, ఆర్థిక మాంద్యాన్ని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలు విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు దోహదం చేశాయని వాణిజ్య విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత నెలలో సైతం ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 6.557.8 కోట్లు అటు ఈక్విటీ, ఇటు రుణ మార్కెట్లలో మదుపు చేయడం జరిగింది. గడచిన జూలై, ఆగస్టు మాసాల్లో భారీగా విదేశీ పెట్టుబడులు రూ. 4,970 కోట్లమేర వెనక్కు మళ్లిన క్రమంలో ఆక్టోబర్ 1నుంచి రుణ మార్కెట్లలోకి 102 శాతం అదనంగా పెట్టుబడులు తిరిగి రావడంతో మొత్తం పెట్టుబడులు ఇప్పటి వరకు రూ. 5,072 కోట్లకు చేరాయి. రానున్న బడ్జెట్ సమావేశాల్లో మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అకాశాలున్నాయని, అలాగే వినమయాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలను చేపడతారన్న ఆశాభావం మదుపర్లలో ఉందని ప్రముఖ విశే్లషకుడు ఉమేష్ మెహతా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డీఏ పెంపు, కార్పొరేట్ పన్నుల్లో కోత, ప్రభుత్వ రంగ భ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడం, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వ్యూహాత్మకంగా పెట్టుబడులను తగ్గించుకోవడం తదిరత కేంద్ర ప్రభుత్వ చర్యలు విదేశీ పెట్టుబడిదారుల దృక్పథాన్ని సానుకూలంగా మార్చిందని ఆయన తెలిపారు. అలాగే అంతర్జాతీయంగా అమెరికా-చైనా పాక్షికంగా వాణిజ్య ఒప్పందానికి రావడం, అలాగే బ్రెగ్జిట్ డీల్‌కు సంబంధించిన చర్చల్లో సైతం సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడం కూడా మొత్తం మార్కెట్లకు లబ్ధిచేకూర్చాయని, సంతృప్తికర త్రైమాసిక ఫలితాలు కూడా ఇందుకు తోడయ్యాయని మరో విశే్లషకుడు అరుణ్ మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే ఉంటే ఈట్రెండ్ దీర్ఘకాలానికి కొనసాగే అవకాశాలున్నాయని, మరిన్ని పెట్టుబడులు వచ్చి అన్ని దేశాల మదుపర్లకు ఈదేశం సురక్షిత పెట్టుబడులకు గమ్యస్థానంగా మారే అవకాశాలున్నాయని మరో విశే్లషకుడు హితేష్ జైన్ తెలిపారు.